Oxygen Langar : ఉచితంగా ఊపిరి పోస్తున్నారు… శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులకు అక్కడ ఆక్సిజన్‌ ఫ్రీ

కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేశంలో ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. ఆసుపత్రుల్లో సరిపడ ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక ప్రతిరోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఉన్న ఓ గురుద్వారా తన పెద్ద మనసు చాటుకుంది.

Oxygen Langar : ఉచితంగా ఊపిరి పోస్తున్నారు… శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులకు అక్కడ ఆక్సిజన్‌ ఫ్రీ

Oxygen Langar

Oxygen Langar : కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేశంలో ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. ఆసుపత్రుల్లో సరిపడ ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక ప్రతిరోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో ఉన్న ఓ గురుద్వారా తన పెద్ద మనసు చాటుకుంది. ఆ గురుద్వారా నిర్వాహాకులు ‘ఆక్సిజన్‌ లాంగర్‌’ను అందుబాటులోకి తెచ్చారు. కరోనా మహమ్మారి సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఒక్క కరోనా రోగులే కాదు శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్న ఎవరికైనా ప్రాణవాయువు అందిస్తామని గురుద్వారా నిర్వాహాకులు తెలిపారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణవాయువు దొరకని వారి కోసం ఆక్సిజన్‌ లాంగర్‌ ఏర్పాటు చేశామని నిర్వాహాకులు చెప్పారు. ఆక్సిజన్‌ పొందేందుకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రాణవాయువు కోసం చాలా మంది వస్తున్నారని, వారందరికీ అందిస్తున్నామని ఘజియాబాద్ గురుద్వారా ప్రబందక్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుర్‌ప్రీత్‌సింగ్‌ చెప్పారు.

తమకు రోజూ వందల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం.. మరికొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటం కంటే కావాల్సింది ఏముంటుందని గురుద్వారా నిర్వాహాకులు అంటున్నారు.

Gurdwaras oxygen langar

”మాకు ఆక్సిజన్ కావాలని గురుద్వార హెల్ప్ లైన్ కి ఫోన్ వచ్చిన వెంటనే.. మేమే మా వాహనాన్ని పంపుతాం. ఆ వ్యక్తి వాహనం దగ్గరికి రాగానే అతడికి ఆక్సిజన్ అందిస్తాం. అతడి ఆక్సిజన్ లెవల్స్ సురక్షిత స్థాయులకు చేరే వరకు లేదా ఆసుపత్రిలో బెడ్ దొరికే వరకు ఆక్సిజన్ అందిస్తాం. రవాణ ఇబ్బందుల కారణంగా ఈ సేవని డోర్ డెలివరీ చెయ్యలేకపోతున్నాం. ఆసుపత్రికి వెళ్లే సమయంలో ఎవరైనా ఆక్సిజన్ అందక తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే వెంటనే మాకు ఫోన్ చేస్తే మేము వారికి ప్రాణవాయువు అందిస్తాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు ఆక్సిజన్ కోసం మా గురుద్వార దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము అందిస్తున్న ఉచిత ఆక్సిజన్ ద్వారా చాలామంది ఉపశమనం పొందుతున్నారు” అని గురుద్వార నిర్వాహాకులు చెప్పారు.

ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో.. దాన్ని క్యాష్ చేసుకునే ముఠాలు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కృతిమ కొరత సృష్టించి డబ్బులు దండుకుంటున్నారు మరికొందరు. ఇలా ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించాలని చూసే కక్కుర్తి మనుషులు ఉన్న ఈ రోజుల్లో.. ఉచితంగా ఊపిరిపోస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు గురుద్వార నిర్వాహాకులు. మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మడమే కాకుండా ఆచరించి చూపిస్తున్న గురుద్వార నిర్వహాకులు చల్లగా ఉండాలని అంతా దీవిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 34వేల 379 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. యూపీలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవం ఇదే తొలిసారి. కరోనాతో 195మంది చనిపోయారు. ఘజియాబాద్ లో ఒక్కరోజు వ్యవధిలో వెయ్యి కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.