Hacking : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరుతో మాల్‌వేర్‌‌లు… హెచ్చరిస్తున్న పోలీసులు..

ప్రస్తుతం దేశమంతటా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. దీంతో హ్యాకర్స్ ఈ సినిమాని ఉపయోగించుకొని..........

Hacking : ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరుతో మాల్‌వేర్‌‌లు… హెచ్చరిస్తున్న పోలీసులు..

Hackers

The Kasmir Files :  జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్త నిర్మాణంలో బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’. ఇటీవల మార్చ్ 11న రిలీజైన ఈ సినిమా మౌత్ టాక్ తోనే మెల్లి మెల్లిగా భారీ విజయం సాధించి కలెక్షన్లని రాబడుతుంది. నరేంద్ర మోడీ, అద్వానీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఈ సినిమా చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు.

ప్రస్తుతం దేశమంతటా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుంది. దీంతో హ్యాకర్స్ ఈ సినిమాని ఉపయోగించుకొని మోసాలకు పాల్పడాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఈ సినిమా పేరుతో అనుమానాస్పద మాల్‌వేర్‌లతో కూడిన లింకులని హ్యాకర్లు పంపిస్తున్నారు. ఈ సినిమాకి ఉన్న ఆదరణ చూసి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాని ఉచితంగా చూడండి అంటూ లింక్స్ పంపిస్తున్నారు.

The Kashmir Files : ఈ సినిమాతో బాలీవుడ్ పాపాలని కడిగేశారు.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై కంగనా వ్యాఖ్యలు..

ఎవరైనా ఇలాంటి లింక్స్ ని క్లిక్ చేస్తే ఈ లింకుల ద్వారా పంపిన మాల్‌వేర్‌లని ఉపయోగించుకొని ఫోన్‌లను హ్యాక్ చేయడం, మొబైల్ నంబర్‌లకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలని ఖాళీ చేయడం చేస్తున్నారు హ్యాకర్లు. ఈ విషయం పోలీసులకి తెలిసి గుర్తు తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఇలా జరిగితే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని తెలిపారు.