Krishnam Raju : హ్యాపీ బర్త్‌డే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు..
గురువారం (జనవరి 20) ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు తన 82వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు..

Krishnam Raju
Krishnam Raju: యంగ్ రెబల్ స్టార్ అండ్ గోర్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, రెబల్ స్టార్ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’..
Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!
ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం (జనవరి 20) ఆయన పుట్టినరోజు. నేటితో రెబల్ స్టార్ 82వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, రెబల్ స్టార్ మరియు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Krishnam Raju – Brahmanandam : కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం గిఫ్ట్..
ఈ సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీం కృష్ణం రాజుకి బర్త్‌డే విషెస్ చెబుతూ.. సినిమాలో ఆయన నటించిన పరమహంస క్యారెక్టర్ తాలుకు పోస్టర్ రిలీజ్ చేశారు. కళ్లల్లో, గెటప్‌లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీక్షణంగా చూస్తున్న రెబల్ స్టార్ లుక్ బాగుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పడిన ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Radhe Shyam : మార్చి 18న ‘రాధే శ్యామ్’?