Hathras: కొవిడ్‌తో భార్య మరణం, రైలుకు ఎదురుగా దూకిన భర్త
భార్య కొవిడ్ తో మృతి చెందిందనే మనస్తాపంతో కదులుతోన్న రైలుకు ఎదురుగా దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు భర్త. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో శుక్రవారం ఈ ఘటన...

DEAD
Hathras: భార్య కొవిడ్ తో మృతి చెందిందనే మనస్తాపంతో కదులుతోన్న రైలుకు ఎదురుగా దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు భర్త. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మే1న అతని భార్య చనిపోగా ఆత్మహత్యకు ప్రయత్నించిన అతని కాలు కోల్పోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి.
మనీశ్ కుమార్ సెంగర్ అనే వ్యక్తి చాలా డిప్రెషన్ లో కూరుకుపోయాడని స్థానికులు అంటున్నారు. టూ వీలర్ రిపైర్ ఉందని బయటకు వెళ్లిన వ్యక్తి మనస్సు మార్చుకుని ఈ పనికి ఒడిగట్టాడు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో చూపించి తర్వాత అలీఘర్ హాస్పిటల్ కు మార్చారు.
అతణ్ని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చాం. తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కాలికి సర్జరీ చేసి పాదాన్ని తొలగించారు. అని బాధితుడు బంధువులు చెబుతున్నారు.
మనీశ్ భార్యార్తలు కొద్ది రోజుల ముందే మూడో వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నారు. మొదటి భార్యతో విడాకులు అయిపోయిన తర్వాత 2018లో వీరి వివాహం అయింది. భార్య మరణం తర్వాత మనీశ్ కు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.
రెండ్రోజుల క్రితం కూతుర్ని చూసుకునేందుకు తాను స్ట్రాంగ్ గా నిలబడతానని చెప్పి.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడనుకోలేదని బంధువులు చెప్తున్నారు.