Hyderabad : నగరంలో కుండపోత..ట్రాఫిక్ అస్తవ్యస్తం, స్తంభించిన జనజీవనం

నగరంలో కుండపోత వర్షం కురిసింది. చినుకు పడితే...నగరం అతలాకుతలమయ్యే పరిస్థితుల్లో గంట, రెండు గంటల పాటు కుంభవృష్టి కురవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమయ్యింది.

Hyderabad : నగరంలో కుండపోత..ట్రాఫిక్ అస్తవ్యస్తం, స్తంభించిన జనజీవనం

Rain

Heavy To Heavy Rainfall : నగరంలో కుండపోత వర్షం కురిసింది. చినుకు పడితే…నగరం అతలాకుతలమయ్యే పరిస్థితుల్లో గంట, రెండు గంటల పాటు కుంభవృష్టి కురవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమయ్యింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో భారీగా వర్షం పడుతుందని, ప్రజలు బయటకు రావొద్దని ముందుగానే హెచ్చరించింది జీహెచ్ఎంసీ. అనుకున్నట్లుగానే సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. డీఆర్ఎఫ్ ను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ..పలు చోట్ల సిబ్బందిని మోహరించింది. రోడ్లపై నిలిచిన నీళ్లను మళ్లించారు. సమస్యలు ఉత్పన్నమయితే…కంట్రోల్ రూం నెంబర్ కు (040-29555500)ను సంప్రదించాలని తెలిపింది.

Read More : Pawan Kalyan : తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు-పవన్ కళ్యాణ్

స్తంభించిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తుఫాన్ గులాబ్ ప్రభావంతో…తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖైరతాబాద్, హిమాయత్ నగర్, పంజాగుట్ట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్ రోడ్, కోఠి, ఆబిడ్స్, సరూర్ నగర్, సైదాబాద్, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బహదూర్ పురా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జీని అధికారులు మూసివేశారు. భారీ వర్షంతో బ్రిడ్జీపై వర్షపు నీరు చేరింది. దీంతో అధికారులు ట్రాఫిక్ మళ్లించారు.

Read More : Kerala : చీరలు కట్టుకుని..యువతుల డ్యాన్స్, సూపర్

సరూర్ నగర్, జూబ్లిహిల్స్, ఫిలింనగర్ లలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
హయత్ నగర్, బేగంపేట, మూసాపేట, కాప్రాలో 3 సెం.మీ వర్షపాతం కురిసింది.
శేరిలింగంపల్లి, యూసుఫ్ గూడ, సికింద్రాబాద్ లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Read More : CoWin : విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్, కొవిన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది

బంగాళాఖాతంలో తుపాన్ గా తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ కు గులాబ్ గా నామకరణం చేసింది. 2021, సెప్టెంబర్ 26వ తేదీ ఆదివారం సాయంత్రం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. తుపాన్ గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ…ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురిక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. ఏపీ, ఒడిశాలో 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.