Kerala : చీరలు కట్టుకుని..యువతుల డ్యాన్స్, సూపర్

కేరళ రాష్ట్రానికి చెందిన పదుల మంది యువతులు ఒకచోట చేరి..డ్యాన్స్ చేశారు. మ్యూజిక్ కు అనుగుణంగా...స్టెప్పులు వేస్తుండడం అందర్నీ ఆకట్టుకుంది.

Kerala : చీరలు కట్టుకుని..యువతుల డ్యాన్స్, సూపర్

Kerala dance

Updated On : September 25, 2021 / 8:39 PM IST

Kerala College Students : సంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని డ్యాన్స్ ఎవరైనా చేస్తారా ? అంటే వామ్మో అంటారు. ఎందుకంటే..కొద్ది మందికి సాధ్యం కాదు కాబట్టి. అయితే..కొంతమంది మహిళలు చీర కట్టుకుని విన్యాసాలు కూడా చేస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..కేరళ రాష్ట్రానికి చెందిన పదుల మంది యువతులు ఒకచోట చేరి..డ్యాన్స్ చేశారు.

Read More : Spider Net : మైండ్ బ్లోయింగ్… సాలీడు గూడు అల్లడం చూశారా..?

మ్యూజిక్ కు అనుగుణంగా…స్టెప్పులు వేస్తుండడం అందర్నీ ఆకట్టుకుంది. అది చీర కట్టులో. అయితే..ఈ వీడియో మాత్రం ఎప్పటిదో…రెండేళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు మరలా వైరల్ అవుతోంది. మిని నాయర్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో మరలా ఓసారి..నెట్టింట వైరల్ గా మారింది. పదుల సంఖ్యలో ఉన్న యువతులు ఒక్కచోట చేరి అద్బుతంగా డ్యాన్స్ చేస్తున్నారు.

Read More : Elon Musk Grimes : ప్రియురాలితో విడిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

సంప్రదాయబద్ధంగా..చీరలు కట్టుకుని…చూడముచ్చటగా రెడీ అయ్యారు. అనంతరం ఓ పాట ప్లే అవుతుండగా…దానికి అనుగుణంగా..స్టెప్పులేశారు. 2019లో ఓనమ్ పండుగకు ముందు ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులు చేసిన డ్యాన్స్ గా తెలుస్తోంది. త్రిస్సూర్ పూరం ఆలయ జాతరలో ‘కంతనిజానుం వరం’ డ్యాన్స్ చేస్తుంటారు. యువతుల డ్యాన్స్ లను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.