Spider Net : మైండ్ బ్లోయింగ్… సాలీడు గూడు అల్లడం చూశారా..?

ఇంటిముందు ముగ్గు వేసినట్టుగా... బట్టపై డిజైన్ పోత పోసినట్టుగా... గులాబీ మొక్కకు అంటు కట్టినట్టుగా... ఎంతో శ్రద్ధగా... పద్ధతిగా అల్లుతుంటుంది.

Spider Net : మైండ్ బ్లోయింగ్… సాలీడు గూడు అల్లడం చూశారా..?

Saaleedu

Spider Net : ఇల్లు అన్నాక గోడలు, మూలల దగ్గర బూజు పట్టడం కామన్. సాలీడు పురుగులు ఉండని ఇల్లు ఉండదు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో బల్లి పాతర అని కూడా అంటారు. వారంరోజులు బూజు కట్టె పట్టకపోతే… ఇల్లంతా తీగలువారిపోతుంది. ఎంత మోడ్రన్ గా ఇల్లు కట్టుకున్నా…. పెంకుటిల్లు అయినా  సాలీడు పురుగులు దూరకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా కష్టం.

సాలీడు ఫాంటసీతో సినిమాల్లో స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. సాలీడు  అల్లే దారం సన్నగా ఉంటుంది… కర్రతో ఇలా అంటే అలా ఊడిపోద్ది అనుకుంటారు చాలామంది. కానీ… ఆ థ్రెడ్ కు చాలా బలం ఉంటుంది. ఎంతగా అంటే… ఓ పక్షి దాంట్లో ఇరుక్కుపోయేంతగా.

మీరెప్పుడైనా చూశార లేదే గానీ…. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే.. సాలీడు వేసే డిజైన్ మామూలుగా ఉండదు. కళ్లు చెదిరిపోవాల్సిందే. ఇంటిముందు ముగ్గు వేసినట్టుగా… బట్టపై డిజైన్ పోత పోసినట్టుగా… గులాబీ మొక్కకు అంటు కట్టినట్టుగా… ఎంతో శ్రద్ధగా… పద్ధతిగా అల్లుతుంటుంది. దానికి ఆ దారం ఎలా వస్తుంది.. ఒంట్లో నుంచి వదిలే లిక్విడ్ దారంగా ఎలా మారుతుంది.. అల్లిక ఎలా డిజైన్ గా మారుతుంది… ఇలాంటివన్నీ చూడటం రియల్ లైఫ్ లో కుదరదు. అందుకే.. ఓ చిన్న వీడియో ఇక్క మీకోసం ఇస్తున్నాం. చూసేయండి.