Asthma : ఆస్తమాతో బాధపడేవారికి మేలు చేసే 5యోగాసనాలు ఇవే?…

ఆస్తమా కారణంగా గాలి పీల్చుకోలేక పోవటం శ్వాసనాళాల్లో వాపు , శ్వాసనాళాలు కుచించుకు పోవటం వంటివి చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో దగ్గు , కఫం వంటివి ఇబ్బందిని కలిగిస్తాయి.

Asthma : ఆస్తమాతో బాధపడేవారికి మేలు చేసే 5యోగాసనాలు ఇవే?…

Yoga

Asthma : ఆస్తమా..దీనినే ఉబ్బసం అని కూడా అంటారు. ఆస్తమా అనేది శ్వాసకోశ వ్యాధి. వివిధ రకాల కారణాల వల్ల వచ్చే ఆస్తమా పిల్లల్లో పెద్దల్లో కనిపిస్తుంది. ఎక్కవకాలంపాటు ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వాతావరణంలో వైరస్ లు, ఎలర్జీలు, చల్లగాలి, ధూమపానం, దుమ్ము,ధూళి, మానసిక ఆందోళన వంటివి ఆస్తమా రావటానికి ముఖ్యకారణాలు. ఆస్తమాతో ఇబ్బంది పడేవారు దాని నుండి ఉపశమనం పొందేందుకు యోగా చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆస్తమా కారణంగా గాలి పీల్చుకోలేక పోవటం శ్వాసనాళాల్లో వాపు , శ్వాసనాళాలు కుచించుకు పోవటం వంటివి చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో దగ్గు , కఫం వంటివి ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ క్రమంలో 5రకాల యోగాసనాలతో శ్వాస బాగా ఊపిరితిత్తులకు అందేలా చేసుకోవచ్చు. వీటివల్ల ఆస్తమా నుండి కొంతమేర ఉపశమనం పొందటమే కాక, రోజు వారి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారికి మేలు చేసే ఆ ఐదు యోగాసనాల గురించి తెలుసుకుందాం…

1. అర్ధ మత్య్యేంద్రాసనం ; ఇది ఆస్తమా రోగులకు చక్కగా ఉపకరిస్తుంది. సగం వెన్నుముకను ఒక పక్కకు తిప్పటం అనేది ఈ ఆసనం లో ప్రధాన భంగిమ. ఈ ఆసనం వేయటం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ బాగా చేరి ఛాతి ఓపెన్ అవుతుంది. ఆస్తమా రోగులు ఈ ఆసనం వేయటం వల్ల ఎంతో రిలాక్స్ లభిస్తుంది.

2. పవన్ముక్తాసనం ; నేలపై వెల్లకిలా పడుకుని కాళ్ళను మెల్లగా వెనక్కు మడవటం ఈ ఆసనం భంగిమ. దీని వల్ల ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ ఆసనం వేయవచ్చు. ఈ ఆసనం వల్ల ఉదర భాగంలోని అవయవాలన్నీ మసాజ్ అనుభూతి పొందుతాయి. జీర్ణవ్యవస్ధకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా రోగులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది.

3. సేతు బంధాసనం ; నేలపై వెల్లకిలా పడుకుని మోకాళ్లను వంచి పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్ గా నేలకు అనుకొని ఉంచటం ఈ ఆసనం భంగిమ. చాలా మంది ఒత్తిడితో సతమతమౌతుంటారు. ఒత్తిడి కారణంగా శ్వాససంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల శ్వాసకోశాల పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి బాగా ఆక్సిజన్ అందుతుంది.

4. భుజంగాసనం ; శరీరాన్ని నేలకు తాకేలా ఉంచాలి. తర్వాత రెండు చేతులతో తలభాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసనం వేసే సమయంలో రెండు చేతులను వ్యాలెన్స్ చేయాలి. ఈ ఆసనాన్ని ఖాళీ కడుపుతో చేయాలి. ఈ ఆసనాన్ని రోజు వారిగా చేయటం వల్ల శ్వాస సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఈ ఆసనం బాగా ఉపకరిస్తుంది.

5. అధో ముఖ స్వనాసనం ; ఈ ఆసనం వేయటం వల్ల ఆస్తమా, సైనస్, పీరియడ్స్ లో వచ్చే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రోజు వారిగా ఈ ఆసనం వేయటం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తగ్గిపోతాయి.