BanNetflix: నవరస ఎఫెక్ట్.. నెట్‌ఫ్లిక్స్ బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్

మణిరత్నం తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'నవరస'. ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చెయ్యాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. ఫోటో పోస్టర్‌లో ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ ముస్లీం సంఘాలు బ్యాన్ చెయ్యాలంటూ కోరుతున్నాయి.

BanNetflix: నవరస ఎఫెక్ట్.. నెట్‌ఫ్లిక్స్ బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్

Netflix

Updated On : August 7, 2021 / 1:16 PM IST

BanNetflix Trending: మణిరత్నం తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘నవరస’. ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చెయ్యాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. ఫోటో పోస్టర్‌లో ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ ముస్లీం సంఘాలు బ్యాన్ చెయ్యాలంటూ కోరుతున్నాయి. సిరీస్‌తో పాటు, స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను కూడా బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నాయి. మణిరత్నం ‘నవరస’ తొమ్మిది విభిన్న కథలతో రూపొందించబడింది. మణిరత్నం – రచయిత జయేందర్ పంచపకేశన్ కలసి భారీ తారాగణంతో రూపొందించిన ఆంథాలజీ సిరీస్ ఇది.

నవరసాలు కథాంశంగా తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలను చూపించడం జరిగింది. హాస్యం-శృంగారం-భయానకం-కరుణ-రౌద్రం-కోపం-ధైర్యం-అద్భుతం-బీభత్సం లాంటి మానవ జీవితంలోని నవరసాల ఎమోషన్స్‌తో సిరీస్ తెరకెక్కేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఆగస్ట్ 6న ఈ సరీస్‌ను విడుదల చేశారు. అయితే, విడుదల చేయగానే సిరీస్‌పై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా #BanNetflix అంటూ ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్‏లో 7వ ఎపిసోడ్ ఇన్మై స్టోరీ పోస్టర్ అసలు వివాదానికి కారణం అవుతోంది. ఈ పోస్టర్‏లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‏ను అవమానించినట్లుగా వారు చెబుతున్నారు. నెట్‏ఫ్లిక్స్‏ను బహిష్కరించాలని, మతపరమైన మనోభావాలని దెబ్బతీశారని అంటున్నారు. ఈ సిరీస్‌లో సూర్య, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, రేబాటి, పార్వతి తిరువట్టు, అశోక్ సెల్వన్, నాగ శౌర్య వంటి దక్షిణాది తారలు నటించారు. తొమ్మిది కథల కోసం విడిగా పోస్టర్లు తయారు చేయబడ్డాయి.

‘గిటార్ కంబి మేలే నిండ్రు’ ‘పాయసం’ ‘సమ్మర్ ఆఫ్ 92’ ‘ఎథిరి’ ‘శాంతి’ ‘రౌద్రమ్’ ‘ప్రాజెక్ట్ అగ్ని’ ‘ఇన్మై’ ‘తునింత పిన్’ వంటి తొమ్మిది ఎపిసోడ్స్ ”నవరస” సిరీస్ పేరుతో విడుదలయ్యాయి. అందులో ‘ఇన్మై’ కథ పోస్టర్‌లో సిద్ధార్థ్ మరియు పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఇన్మై’ అంటే భయం అని, ఫోటో పోస్టర్‌లో ఖురాన్‌ను అవమానించారని ఆరోపించారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టర్ తమిళ భాషా వార్తాపత్రికలో ముద్రించబడింది.