Harish Rao : ఇంత డెవలప్‌మెంట్ దేశంలో ఎక్కడా చూడలేదు.. సీఎం కేసీఆర్‌పై క్రికెటర్ రాయుడు, హీరో నాని ప్రశంసల వర్షం

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ స్టేడియంలో కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ సీజన్‌-3ని సినీ నటుడు నాటి, క్రికెటర్‌ అంబటి రాయుడుతో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గత పదేళ్లలో సిద్దిపేటలో చూసిన అభివృద్ధి దేశంలో మరెక్కడా చూడలేదన్నారు అంబటి రాయుడు. తెలుగు వారు మరింత మంది జాతీయ క్రికెట్ ఆడాలన్నారు. మంచి కోచ్ లను ఏర్పాటు చేస్తే మరింత మంది క్రికెట్ లోకి వస్తారని, జాతీయ స్థాయిలో ఆడతారని అన్నారు.

Harish Rao : ఇంత డెవలప్‌మెంట్ దేశంలో ఎక్కడా చూడలేదు.. సీఎం కేసీఆర్‌పై క్రికెటర్ రాయుడు, హీరో నాని ప్రశంసల వర్షం

Harish Rao : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ స్టేడియంలో కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ సీజన్‌-3ని సినీ నటుడు నాటి, క్రికెటర్‌ అంబటి రాయుడుతో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గత పదేళ్లలో సిద్దిపేటలో చూసిన అభివృద్ధి దేశంలో మరెక్కడా చూడలేదన్నారు అంబటి రాయుడు. తెలుగు వారు మరింత మంది జాతీయ క్రికెట్ ఆడాలన్నారు. మంచి కోచ్ లను ఏర్పాటు చేస్తే మరింత మంది క్రికెట్ లోకి వస్తారని, జాతీయ స్థాయిలో ఆడతారని అన్నారు.

”ఇక్కడికి రావడం తనకు సక్సెస్ సెలబ్రేషన్ కు వచ్చిన ఆనందం కలుగుతుందన్నారు హీరో నాని. 378 టీమ్ లు ఆడటం గ్రేట్ అన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ బహుశా దేశంలోనే జరగలేదన్నారు. సిద్ధిపేట అంటే చిన్న టౌన్ అనుకున్నా కానీ గచ్చిబౌలిలో తిరుగుతున్నట్లు ఉందన్నారు. రూరల్ ఏరియాలో ఉన్న కంటెంట్ దసరా, దసరాలో ప్రతి ఒక్కరికి తామే కనిపిస్తారు. దసరా రీ సౌండ్ కు ఇండియా అదరాలి. దసరాలో తెలంగాణ కల్చర్ కనిపిస్తుంది” అని నాని అన్నారు. హీరో నాని తన దసరా సినిమా ప్రమోషన్‌ను సిద్ధిపేట వేదికగా ప్రారంభించాడు. తెలంగాణ యాసలో దసరా సినిమా డైలాగులు చెప్పి.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. వీలైతే మళ్లీ దసరా సక్సెస్ మీట్‌ కోసం సిద్దిపేటకు వస్తానన్నాడు నాని.

Also Read..Minister KTR: “అన్నీ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎన్నో నష్టాలు” అంటూ సీతారామన్ కు కేటీఆర్ లేఖ

” 140 కోట్ల జనాభాలో ఇండియా టీమ్ లో ఆడేది 11 మందే. అందులో ఒక్కరు మన తెలుగు బిడ్డ అంబటి రాయుడు అని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. సిద్దిపేటతో అంబటి రాయుడికి మంచి సంబంధం ఉందని గుర్తు చేశారు. అంబటి రాయుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తన ఎకరంన్నర భూమి ఇచ్చాడని మంత్రి చెప్పారు. ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో బంగారం లాంటి పంట పండిస్తున్నాడని చెప్పారు.(Harish Rao)

నిత్య జీవితంలో కనబడే పాత్రల నటుడు నాని. న్యాచురల్‌గా సినిమాల్లో నటించి న్యాచురల్ స్టార్ అయ్యాడు. నేను సినిమాలు తక్కువ చూస్తా. కానీ నాని జెర్సీ సినిమా చూశా. జెర్సీ సినిమాలో గల్లీ క్రికెటర్ గా ఆడి జాతీయ స్థాయిలో అడటానికి పట్టుదలతో కృషి చేసి విజయం సాధించే పాత్ర నేటి యువతకు ఆదర్శం. అలాంటి పట్టుదలతో యువత ముందుకు సాగాలి.

Also Read..Nirmala Sitharaman: అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

యువత నిజ జీవితంలో ఆటల్లో, చదువుల్లో, సామాజిక సేవలో ఆల్ రౌండర్లుగా ఎదగాలి. కేసీఆర్ లో కే అంటే కారణ జన్ముడు. సీ అంటే చిరస్మరణీయుడు. ఆర్‌ అంటే ఎంతో మంది రాతను మార్చిన మహనీయుడని కొనియాడారు మంత్రి హరీశ్ రావు. కానే కాదు రానే రాదు అన్న తెలంగాణను సాధించి పెట్టారు కేసీఆర్. రాబోయే రోజుల్లో అద్భుతమైన క్రీడాకారులను తయారు చేసుకుందాం. దేశంలో మార్పు కోసం మరో లక్ష్యంతో బయలుదేరారు కేసీఆర్. తెలంగాణ తరహా అభివృద్ధి దేశంలో తేవడానికి కేసీఆర్ బయలుదేరారు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈ సందర్భంగా నాని నటించిన సినిమా దసరా ప్రమోషన్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. హీరో నానిని, అంబటి రాయుడుని చూసేందుకు అభిమానులు సిద్దిపేట క్రికెట్ స్టేడియానికి పోటెత్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.