బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో 8 రోజులు సెలవులు

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో 8 రోజులు సెలవులు

holidays for banks in march month: మీకు బ్యాంకు ఖాతా ఉందా? బ్యాంకులో పనుందా? ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు జరపాలా? అయితే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మార్చిలో 31 రోజులు ఉంటే అందులో నాలుగు ఆదివారాలు(7, 14, 21, 28), రెండో శనివారం(13న), నాలుగో శనివారం(27న) బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు మహాశివరాత్రి(11న), హోలీ(29న) పండుగలు కూడా మార్చిలోనే వచ్చాయి. దీంతో మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవే.

మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడతాయి. నాలుగో శనివారం, ఆదివారం, హోలీ పండుగ వరుసగా మూడు రోజులు వచ్చాయి.

ఈ 8 రోజులతో పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. తొమ్మిది బ్యాంక్ ఎంప్లాయ్ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపట్టనున్నాయి. ప్రకటించినట్టుగా సమ్మె జరిగితే మరో రెండురోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు దిగితే మార్చి 14న ఆదివారం వచ్చింది కాబట్టి వరుసగా మూడు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.

సో.. మార్చిలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం బెటర్. లేదంటే ఇబ్బందులు తప్పవు.