మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి Link ఎలా యాడ్ చేయాలో తెలుసా?

మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి Link ఎలా యాడ్ చేయాలో తెలుసా?

మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి Link ఎలా యాడ్ చేయాలో తెలుసా?

మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? అయితే మీ అకౌంట్లో స్టోరీకి లింక్ యాడ్ చేయడం తెలుసా? పోను ఎప్పుడైనా ట్రై చేశారా? స్టోరీకి లింక్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.. ముందుగా.. షేరింగ్ విషయానికి వస్తే ఇన్‌స్టాగ్రామ్ కాస్తా కష్టంగా ఉంటుంది. ఇతరుల పోస్ట్‌లను షేర్ చేసేటప్పుడు మీరు కొంచెం క్రియేటీవ్ గా ఆలోచించాలి. మీ బయోలో కాకుండా లింక్‌లను షేర్ చేసుకోవడం సాధ్యం పడదు. మీ స్టోరీలలో లింక్‌లను షేర్ చేయడానికి ఎలా అర్హత పొందాలో తెలుసుకుందాం.. ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.. 

అర్హత పొందడం ఎలా? : 
లింక్‌లను షేర్ చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. ముందుగా మీ బిజినెస్ అకౌంట్ లేదా క్రియేటర్ అకౌంట్ అవసరం. అప్పుడు మీకు 10,000 మంది ఫాలోవర్లు ఉండాలి. ఫాలోవర్లను పొందినప్పుడే మీరు లింక్ చేసేందుకు అర్హత సాధిస్తారు. కానీ, వ్యక్తిగత ఖాతా నుంచి బిజినెస్ లేదా క్రియేటర్ అకౌంట్‌కు మారడం చాలా సులభమని చెప్పాలి. 

యాప్‌లో మీ ప్రొఫైల్ పేజీలో కింది ఉన్న మెను ఐకాన్‌పై నొక్కండి. మెను దిగువన ఉన్న సెట్టింగులను Tap చేయండి. అకౌంట్ Tap చేయండి. బిజినెస్ అకౌంట్‌కు మారండి లేదా క్రియేటర్ అకౌంట్‌కు మారండి. స్క్రీన్‌పై పాప్ అప్‌ను చదవండి. ఆపై Changeపై నొక్కండి. ఇప్పుడు మీరు Action లింక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

స్టోరీలలో లింక్‌ను ఎలా క్రియేట్ చేయాలంటే? :
స్టోరీకి లింక్‌ను యాడ్ చేయడం సులభం. సాధారణంగా ఇష్టపడే స్టోరీని ఎంపిక చేసుకోండి. ఆపై స్క్రీన్ ఎగువన ఉన్న లింక్ ఐకాన్ నొక్కండి. ఆ తర్వాత + ఐకాన్ నొక్కండి. మీ లింక్‌ను యాడ్ చేయండి. నీలిరంగు చెక్‌మార్క్ ఐకాన్ ట్యాప్ చేసి Doneపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ స్టోరీని పోస్ట్ చేయవచ్చు.
How to add a link to your Instagram Story 

లింకింగ్ స్క్రీన్‌లో బిజినెస్ పార్టనర్ ను ప్రోత్సహించడానికి అనుమతించే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ ఎంపిక ఉండదు. ఇది ప్రాథమికంగా పేమెంట్స్ పార్టనర్ అకౌంట్ పోస్టులకు మాత్రమే కనిపిస్తుంది. ఈ పోస్టుకు జోడించబడిన ఒక లేబుల్, పోస్ట్ పనిచేస్తుందో లేదో చూడటానికి మీ పార్టనర్‌ను అనుమతిస్తుంది. ఈ ఆప్షన్ గురించి మీరు నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మీ స్టోరీ లైవ్ అయిన తర్వాత, యాక్షన్ కాల్ మీ పోస్ట్‌కు యాడ్ అవుతుంది. స్క్రీన్ దిగువన “Learn More” అని Note స్వైప్ చేయడానికి వీక్షకులను ప్రోత్సహించే Icon ఉంటుంది. ఎవరైనా యూజర్ స్వైప్ చేసినప్పుడు మీరు లింక్ చేసిన వాటికి ఆటోమాటిక్ గా రీడైరెక్ట్ అవుతారు. మీ స్టోరీకి యానిమేటెడ్ “swipe up” GIF స్టిక్కర్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్లలో అనేక రకాలు ఉన్నాయి. మీరు మీ స్టోరీకి సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు. 

    ×