KGF 2: యష్ కోసం ఐటెం భామలు ఇద్దరా? ఒకరా?

కన్నడ సినిమాగా వచ్చి ఇండియాను షేక్ చేసిన సినిమా కేజేఎఫ్. ఒకరకంగా హీరో యష్ ను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

KGF 2: యష్ కోసం ఐటెం భామలు ఇద్దరా? ఒకరా?

Kgf2

KGF 2: కన్నడ సినిమాగా వచ్చి ఇండియాను షేక్ చేసిన సినిమా కేజేఎఫ్. ఒకరకంగా హీరో యష్ ను పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమా కన్నడలో తొలి రూ. 230 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయగా హిందీలో దాదాపు రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అంచనాలు లేకుండానే బాక్స్ ఆఫీస్ అంతుచూసిన ఈ సినిమాకు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో సీక్వెల్ వస్తుంది.

కెజియఫ్ 2 సినిమా ప్రకటన రోజు నుండే కేజీఎఫ్ అభిమానులు విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఒకటి రెండు కాదు.. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోగా యూ ట్యూబ్‌లో సరికొత్త చరిత్రకు తెరతీసింది. జులై 16న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది. అయితే.. ఈ సినిమా గురించి అప్ డేట్ ఏం వస్తుందా అని ఎదురుచూసే అభిమానులకు ఇప్పుడు ఓ వార్త తెగ కిక్కిచ్చేస్తోంది.

కెజియఫ్ 2 సినిమాలో అభిమానులకు కావాల్సిన అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త పడుతున్న ప్రశాంత్ నీల్ ఇందులో రెండు స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఫస్టాఫ్‌లో ఒకటి.. సెకండాఫ్‌లో మరో స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు వినిపిస్తుంది. ఈ పాటల కోసం జాక్వెలిన్, నోరా ఫతేహిలను తీసుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు సినిమాలో ఉండేది ఒకే పాటని.. కాకపోతే బాషలను బట్టి భామలను మార్చి ఒకేపాటను ఇద్దరి మీద తెరకెక్కించనున్నారని మరో ప్రచారమూ ఉంది. మరి ఇందులో ఏది నిజమో ఇంతకీ ఆ స్పెషల్ భామ ఎవరో యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి ఉండాల్సిందే.