Monkey Fight: రోడ్‌పై వందల కోతులు ఒకేసారి.. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్

సినిమాల్లో.. లేదా ఏదైనా యూట్యూబ్ వీడియోల్లో చూస్తుంటాం ఈ గ్యాంగ్ వార్‌లు. థాయ్‌లాండ్ లోని ప్రధాన రహదారిపై వందల్లో కోతులు రోడ్లపైకి వచ్చేసి గ్యాంగ్ వార్ మొదలెట్టేశాయి. వచ్చే వాహనాలు వేటిని పట్టించుకోకుండా వాటి గొడవలో అవే ఉన్నాయి.

Monkey Fight: రోడ్‌పై వందల కోతులు ఒకేసారి.. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్

Monkeys Fighht

Monkey Fight: సినిమాల్లో.. లేదా ఏదైనా యూట్యూబ్ వీడియోల్లో చూస్తుంటాం ఈ గ్యాంగ్ వార్‌లు. థాయ్‌లాండ్ లోని ప్రధాన రహదారిపై వందల్లో కోతులు రోడ్లపైకి వచ్చేసి గ్యాంగ్ వార్ మొదలెట్టేశాయి. వచ్చే వాహనాలు వేటిని పట్టించుకోకుండా వాటి గొడవలో అవే ఉన్నాయి. భయపడిన వాహనదారులు అక్కడే ఆగిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది.

భయం లేకుండా రోడ్లపైనే రచ్ఛ మొదలుపెట్టేసిన కోతులు వీడియో నెట్టింట వైరల్ అయంది. అటుగా వెళితే ఎక్కడ ఆ గొడవ నుంచి తమ వైపుకు డైవర్ట్ అవుతాయోనని భయపడి ఆగిపోయాయి మోటార్ బైకులు, కార్లు. సువన్పాక్ అనే ఫేస్ బుక్ యూజర్ పోస్టు చేసిన వీడియోను దాదాపు 10వేల మందికి పైగా షేర్ చేశారు.

ప్రాంగ్ శామ్ యోత్ ప్రాంతంలో ఫ్రా కన్ పుణ్యక్షేత్రం ఎదురుగా ఈ ఘటన జరిగింది. పాపులర్ టూరిస్ట్ ప్రాంతం వేల కోతులు ఉండేందుకు నివాసంగా మారింది. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉండటంతో అందరూ ఇళ్లలోనే ఉండి వాటికి తిండిపెట్టే వారు కరువై అలా రోడ్లపైకి ఎక్కేశాయి. దొరికిన ఏ చిన్నపాటి ఆహారమైనా ఒకదానితో మరొకటి పోటీపడి లేదా కొట్లాడి అలా బతికేస్తున్నాయి.

ఇంకా వీడియోలో.. కోతులు ఒక దానిని మరొకటి కొట్టుకుటంటూ.. గాయాలకు పాల్పడుతున్న ఘటన చూడొచ్చు. కోతులను గొడవ నుంచి ఆపడం మామూలు విషయం కాదు. ఈ ఘటన ఫలితంగా చాలా కోతులు గాయానికి గురయ్యాయి. రోడ్లపైనే రక్తం కారుతున్నా.. పట్టించుకోకుండా గొడవపడుతూనే ఉన్నాయి.