Gujarat High Court : భార్యకు ఇష్టముంటేనే ఉంటుంది..కలిసి ఉండాలని ఒత్తిడి చేయకూడదు : హైకోర్టు కీలక తీర్పు
భార్యకు ఇష్టముంటేనే ఉంటుంది..కలిసి ఉండాలని ఒత్తిడి చేయకూడదని.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా బలవంతంగా కాపురం చేయకూడదని హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

Gujarat High Court Say Man Can't Force Wife To Cohabit
Gujarat High Court say Man can’t force wife to cohabit : మహిళలకు హక్కులుంటాయి. కానీ ఎంతమంది మహిళలు వారి హక్కుల్ని దక్కించుకుంటున్నారు అనేది ప్రశ్నార్ధకమే. ముఖ్యంగా ఓ యువతి భార్య అయ్యాక ఇక హక్కుల గురించి మర్చిపోవాల్సిందే. ఒకవేళ ఆమె చైతన్యవంతురాలు అయితే..వెనుకున్న పెద్దవాళ్లు ఒప్పుకోరు..సర్దుకుపోవాలమ్మా అంటూ చెప్పుకొస్తారు. అయితే భార్యకు కూడా ఓమనసుంటుందని..ఆమెకు ఇష్టాలు..అయిష్టాలు ఉంటాయనే ఆలోచన..అర్థం చేసుకునే భర్త ఉంటా
Read more : COVID-19 : నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా..మహిళకు కోవిడ్ పాజిటివ్..
మహిళల హక్కులను సమర్ధిస్తూ గుజరాత్ హైకోర్టు అంత్యం కీలక తీర్పునిచ్చింది. భార్య బానిసక కాదు అని స్పష్టం చేసింది. భార్యకు ఇష్టం ఉంటేనే భర్తతో కలిసి ఉంటుంది. ఇష్టంలేకపోతే ఆమెను తనతో కలిసి ఉండాల్సిందేనని..కాపురం (దాంపత్య హక్కు) చేయాలని భర్త ఒత్తిడి చేయకూడదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్తతో కలిసి జీవించటానికి భార్య నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వులున్నా సరే భర్త ఆమెపై కలిసి ఉండాలని ఒత్తిడి చేయకూడదని స్పష్టంచేసింది.
బనస్కాంత దంపతుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేస్తు తీర్పు వెలువరించింది. నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ తన భర్తతో విభేదాలు వచ్చి పుట్టింటిలోనే ఉంటోంది. 2015లో వివాహం అయిన ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఆమె భర్త పలన్‌పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి..ఆమె నా భార్య..ముస్లిం వివాహం చట్టం ప్రకారం ఆమెతో దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ కోరాడు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు భర్తతో కలిసి జీవించాలని మహిళను ఆదేశించింది. దీంతో సదరు మహిళ..నిత్యం వేధించే భర్తతో కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని..ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
Read more : Viral Video: కవాతుకు అడ్డొచ్చిన చిన్నారి కాలును తొక్కిన సైనికుడు
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ..భార్య అంటే బానిస కాదు..ఆమెకు ఇష్టం లేకుండా భర్తతో కలిసి ఉండాలని..దాంపత్య హక్కులను ఏర్పరచుకునేందుకు భర్త భార్యను ఒత్తిడి చేయకూడదని..కలిసి జీవించేందుకు భార్య నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆమెపై ఒత్తిడి చేయలేరని జస్టిస్ జేబీ పర్దివాలా, నిరల్ మెహతాతో కూడిన హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.