COVID-19 : నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా..మహిళకు కోవిడ్ పాజిటివ్..

నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా గానీ ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె దుబాయ్ ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది.

COVID-19 : నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నా..మహిళకు కోవిడ్ పాజిటివ్..

Woman Vaccinated 4 Times Against Covid, Tests Positive

Woman vaccinated 4 times against COVID, tests positive : కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకోండీ..సురక్షితంగా ఉండండీ అంటూ ప్రభుత్వాలు..వైద్య సిబ్బంది పదే పదే చెబుతున్నారు. కానీ చాలామంది కరోనా థర్డ్ వేవ్ భయపెడుతున్నా ఈనాటికి వ్యాక్సిన్ వేయించుకోవట్లేదు. కానీ రెండు కాదు మూడు డోసులు వేయించుకున్నా కరోనా ఐడోంట్ కేర్ అంటోంది. కరోనా కొత్త వేరియంట్లతో హడలెత్తిస్తున్న క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండీ..బూస్టర్ డోస్ కూడా వేయించుకోండి అని చెబుతున్నారు. కానీ ఇండోర్ లో అయితే ఓ మహిళ మూడు కాదు నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకుంది. అయినా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దుబాయ్‌ వెళ్లడానికి ఇండోర్‌ విమానాశ్రయానికి వచ్చిన ఆమెకు పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వటంతో ఆమె షాక్ అయ్యింది.

కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతోంది. ఒమిక్రాన్ అంటూ హడలెత్తిస్తోంది. కొత్త రూపంలో వచ్చిన వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ వదలట్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు టీకా టీసుకున్న 30 ఏళ్ల మహిళ కరోనా బారిన పడింది. ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి దుబాయ్‌ వెళ్లడానికి ఇండోర్‌ విమానాశ్రయానికి కోవిడ్ నిబంధనల ప్రకారం అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది. చికిత్స కోసం ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఆమె 2021 జనవరి నుంచి ఆగస్టు మధ్య పలు దేశాల్లో పర్యటించిన సందర్భంలో కరోనా వ్యాక్సిన్‌ నాలుగు డోసులు తీసుకుందని అధికారులు తెలిపారు.

కాగా ఆమె దుబాయ్ నుంచి బంధువుల ఇంటిలో వివాహానికి 12 రోజుల క్రితం ఇండియా వచ్చింది. తరువాత తిరిగి దుబాయ్ వెళ్లటానికి ప్రయాణ సన్నాహాలు చేయించుకునే క్రమంలో ముందు జాగ్రత్తగా ప్రయాణానికి కొన్ని రోజుల ముందే కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. దుబాయ్ వెళ్లటానికి ఇండోర్ ఎయిర్ పోర్టుకు రాగా అధికారులు ఆమెకు ర్యాపిడ్ ఆర్‌టి-పిసిఆర్ పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఇండోర్ ఆరోగ్య శాఖ వైద్య అధికారి డాక్టర్ ప్రియాంక కౌరవ్ తెలిపారు.