Weekend farming : వీకెండ్ వ్యవసాయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఫోకస్..ఫాం హౌసుల్లో కడక్‌ నాథ్‌ కోళ్ల పెంపకం..

వీకెండ్ వ్యవసాయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నగర శివారుల్లో స్థలాలు కొని వాటిల్లో పండ్ల తోటల్ని..కొంత స్థలంలో షెడ్లు నిర్మించి వాటిలో కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నారు. అలా ఇటు ఉద్యోగాలు..అటు వీకెండ్ వ్యవసాయాలు చేస్తు మంచి లాభాలాభాలను ఆర్జిస్తున్నారు.

Weekend farming : వీకెండ్ వ్యవసాయంపై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఫోకస్..ఫాం హౌసుల్లో కడక్‌ నాథ్‌ కోళ్ల పెంపకం..

Software Employees Kadaknath Chicken Farming

software employees kadaknath chicken farming : భరత్ అనే నేను సినిమాలో ‘వీక్ ఎండ్ వ్యవసాయం’ గురించి చూశాం. అది వ్యవసాయాన్ని పెంచటం కోసం అనే సందేశం ఇచ్చే సినిమా. కానీ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా చక్కగా వ్యాపారం చేస్తున్నారు. ట్రెండ్ ను ఫాలో అవ్వటంలో సాఫ్ట్ వేర్ వాళ్లు ముందుంటారు. అలా నల్లటి కోళ్లను అదేనండీ కడక్‌ నాథ్‌ కోళ్ల పెంపకాలు చేసేస్తు నాలుగు చేతులా సంపాదించేస్తున్నారు. నగర శివార్లుల్లో ఈ కడక్‌ నాథ్‌ కోళ్ల పెంపకాలతో ఇటు వారానికి నాలుగు రోజులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతూ..మరోపక్క మరో రెండు రోజులు కోళ్ల పెంపకంలో బిజీ బిజీగా గడుపుతూ చక్కగా సంపాదించేస్తున్నారు.

నల్లటి నలుపు రంగులో మెరిసిపోయే కడక్‌ నాథ్‌ కోళ్ల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. మాంసం రుచితో పాటు ఈ కోడి మాంసంలో ప్రొటీన్ల శాతం అధికంగా ఉన్నాయనే టాక్ తో చక్కగా అటు ఉద్యోగం ఇటు కోళ్ల పెంపకాలల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చక్కగా సంపాదించేస్తున్నారు. పైగా ఇది కరోనా కాలం శరీరానికి ప్రొటీన్లు బాగా అవసరం. దీంతో కడక్ నాథ్ కోళ్ల వ్యాపారానికి మంచి డిమాండ్ పెరిగిపోయింది. పైగా ఆకోడి మాంసంలో ప్రొటీన్లు ఎక్కువతో పాటు కొవ్వు చాలా తక్కువగా ఉండటంతో మాంసం ప్రియులు బాగా లాగించేస్తున్నారట. వీటితో పాటు ఇంకెన్నో సుగుణాలు కల్గిన కడక్‌నాథ్‌ అనే నల్ల కోళ్ల పెంపకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంట్రస్ట్ బాగా పెరిగిపోతోంది.

రైతులు కూడా అటు వ్యవసాయంతో పాటు ఇటు ఈ కడక్ నాథ్ కోళ్ల పెంపకాలను చేపట్టారు. వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కడక్ నాథ్ కోళ్ల పెంపకం మంచి లాభసాటిగా ఉందంటున్నారు. ఈక్రమంలో మేం సాఫ్ట్ వేర్ ఉద్యోగులమే కాదు వ్యాపారులం కూడా అంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హైదరాబాద్‌ నగర శివారు ఫాం హౌజ్‌లలో కడక్‌ నాథ్‌ కోళ్ల పెంపకంను మొదలు పెట్టారు. ఈ కోవలోనే వికారాబాద్ జిల్లాలో కొంత మంది సాఫ్ట్ వేర్ మిత్రులు టీమ్ గా ఏర్పడి పెట్టుబడులు పెట్టి కడక్ నాథ్ కోళ్ల పెంపంకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఈ కోళ్ల మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం కూడా కుటీర పరిశ్రమలా మారింది. బ్రాయిలర్ పరిశ్రమ ఉన్నాగానీ..నాటుకోళ్లపై మక్కువ తగ్గలేదు మాంసం ప్రియుల్లో. నాటు కోడి కూర అనగానే ఎగబడని మాంసం ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీంతో రైతులు నాటుకోళ్లలో భిన్నమైన రకాల కోళ్ల పెంపకాన్నిచేపడుతున్నారు. ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో నాటు కోడిని తలదన్నేలా కడక్ నాథ్ కోళ్లు మార్కెట్లో మాంసం ప్రియుల్ని దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఈ కోడి మాంసం కిలో ధర ఐదారొందలు ఉన్నాడ డిమాండ్ కూడా అలాగే ఉందంటున్నారు మాంసం వ్యాపారులు.ఈ మాంసంలో ఔషధ గుణాలు, అత్యధిక ప్రోటీన్లతోపాటు..పురుషుల్లో పుంసత్వాన్ని పెంచే లక్షణాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. దీంతో అందరి దృష్టీ ఇప్పుడు ఈ జాతిపై పడినట్లుగా ఉంది మార్కెట్ లో దీని డిమాండ్ చూస్తుంటే. దీంతో కొంతమంది సాఫ్ట్ వేర్ యువకులు కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇటు లక్షల్లో జీతాలు..అటు కోళ్ల పెంపకంతో మంచిగా సంపాదిస్తున్నారు.

హైదరాబాద్ శివారుల్లో కడక్ నాథ్ కోళ్ల పెంపెకం స్టార్ట్ చేసిన ఓ సాఫ్ట్ వేర్ యువకుల టీమ్ కు హైదరాబాద్ లో సొంతంగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. వారానికి ఐదు రోజులు ఉద్యోగం.. మరో రెండు రోజులు ఖాళీగా ఉంటుంది. ఈ టైమ్ ను వేస్ట్ చేసుకోకుండా..ఈ పాండమిక్ టైమ్ లో వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనేసి.. 9 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటి..మరో ఎకరంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి..దాంట్లో కడక్ నాథ్ కోళ్ల పెంపకం చేపట్టారు. మొదట 500 కోళ్ల తో ప్రారంభించిన వీరి పెంపకం ఇప్పుడు దాదాపు ఆరు వేల కోళ్ల వరకూ పెంచుతున్నారు.

ఈ యువ సాఫ్ట్ వేర్ రైతులు కోళ్లను ఫ్రీరేంజ్ పద్ధతిలో పెంపకం చేపడుతున్నారు. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకరి తరువాత మరొకరు ఫామ్ లను పర్యవేక్షిస్తున్నారు. కోళ్ల తిండి ఖర్చు పెద్దగా పెరగకుండా చూసుకోవటానికి స్థానికంగా ఏండే రైతుల నుండి వేస్టేజ్ కూరగాయలు, ఆకు కూరలు సేకరించి కోళ్లకు ఆహారంగా వేస్తున్నారు. అంతే కాకుండా కోళ్ళను రోగనిరోధక శక్తిని పెంచేందుకు వేపాకు, కరివేపాకు, మునగాకును వేయడమే కాకుండా నీటిలో పసుపు, అల్లం, వెల్లుల్లి రసాన్ని కలుపుతున్నారు. మరోవైపు కోళ్లు పెట్టిన గుడ్లలో కొన్నింటిని మార్కెట్ చేసుకుంటూ మరికొన్నింటిని ఇంక్యూబేటర్ ద్వారా పిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇలా కడక్ నాథ్ కోళ్లు వీళ్లకు బంగారు గుడ్లు పెట్టేంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.