Hyderabad : సెల్ఫీ తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకోవచ్చు

హల మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ఈ స్కూటర్ సేవలను మూడు నెలల పాటు ఫ్రీగానే పొందవచ్చు.

Hyderabad : సెల్ఫీ తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకోవచ్చు

Hala App

Updated On : December 1, 2021 / 1:01 PM IST

Startup Hala Mobility : ఏదైనా ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేయాలంటే..కంపల్సరీగా తాళం చెవి ఉండాల్సిందే. ఎక్కడైనా తాళం చెవిపోతే..ఇక అంతే సంగతులు. మరలా కొత్త తాళం చెవి తీసుకుని బండిని ఆన్ చేసుకుంటుంటారు. టెక్నాలజీ కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. తాళం చెవితో పనిలేకుండానే..స్టార్ట్ చేసుకొనే సౌలభ్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ విషయంలో ‘హల’ కొత్త ఆవిష్కరణ చేసింది. హల మొబిలిటీ యాప్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, ఛార్జింగ్ స్టేషన్లు ఇతరత్రా సేవలను వినియోగదారులు తెలుసుకొనే అవకాశంది ఉంది. మెట్రోపాలిటిన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను హల తీరుస్తుందని జయశే్ రంజన్ తెలిపారు.

Read More : Gun Firing in US school : అమెరికాలోని స్కూల్‌లో 15 ఏళ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

హల మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ఈ స్కూటర్ సేవలను మూడు నెలల పాటు ఫ్రీగానే పొందవచ్చు. స్టార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటివి ఇందులో అమర్చారు. మొబైల్ యాప్ ద్వారా..డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు. ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను క్షణాల్లో సేకరిస్తుంది. ఈ స్కూటర్ ప్రయాణానికి అనుమతినిస్తుంది. ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సాహించాలని ఈ యాప్ ను రూపొందించడం జరిగిందని…సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పలు విద్యా సంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ఈ స్కూటర్ సేవలను హల అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది.