Bandla Ganesh : నన్ను గెలిపిస్తే కెసిఆర్ తో మాట్లాడి 100 ఇళ్ళు కట్టిస్తా.. బండ్లగణేష్
సినీ 'మా' ఎలక్షన్స్ మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ తమ ప్యానల్ మెంబెర్స్ ని ప్రకటించారు. నామినేషన్లని కూడా దాఖలాలు చేశారు.

Bandla Ganesh
Bandla Ganesh : సినీ ‘మా’ ఎలక్షన్స్ మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ తమ ప్యానల్ మెంబెర్స్ ని ప్రకటించారు. నామినేషన్లని కూడా దాఖలాలు చేశారు. వరుస ప్రెస్ మీట్స్ పెడుతూ ఒకరిపై ఒకరు ఘాటుగా మాట్లాడుతున్నారు. ఒకరి మాటలకి మరొకరు కౌంటర్లను విసురుతున్నారు. ఇప్పటికే రెండు ప్యానల్స్ మధ్యలో యుద్ధమే నడుస్తుంది.
తాజాగా వీరిద్దరి మధ్యలోకి బండ్ల గణేష్ వచ్చారు. ‘మా’ ఎలక్షన్స్ లో జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు బండ్ల గణేష్. ఇవాళ ఆ పదవికి నామినేషన్ వేసిన అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. తనకి పరమేశ్వరుడి మద్దతు ఉందని, ‘మా’ కుటుంబంలో కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారని, నేను గెలవడం పక్కా అని తెలిపారు. ఇంతకు ముందు గెలిచినా వాళ్ళు ఏమి చేయలేదని అన్నారు. అడిగితే కరోనా ఉందని తప్పించుకుంటున్నారు.
‘మా’ అసోసియేషన్‌కు భవనం కావాలి అంతే కానీ జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో ఇంద్రభవనం కడతామంటే కుదరదు. దాంతో పాటు 100మంది పేద కళాకారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా కట్టించాలి. సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి మహా ప్రభో మాకు స్థలం ఇప్పించండి, మా డబ్బులతో పేద కళాకారులకు ఇళ్లు కట్టిస్తాం అని అడిగితే ఆయన కాదనరని నా నమ్మకం అని అన్నారు. ఈ సారి నేను గెలిస్తే పేద కళాకారులకు ఇళ్ళు కట్టడానికి కెసిఆర్ ని స్థలం ఇమ్మని అడుగుతానని, మన హీరోలు ఒక్కొక్కరు వజ్రాల్లాంటి వాళ్ళు, వారు దయతలిచి సహాయం చేస్తే 100 మంది పేద కళాకారులకి ఆ స్థలంలో ఇళ్ళు కట్టిస్తాను అని మీడియాతో తెలిపాడు బండ్ల గణేష్.