సాయం కోసం సంప్రదిస్తే.. సోనూసూద్ ఫౌండేషన్‌ పేరిట మోసం..

సాయం కోసం సంప్రదిస్తే.. సోనూసూద్ ఫౌండేషన్‌ పేరిట మోసం..

సైబర్ నేరగాళ్లు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు చేసే పనులకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో ఈ మోసాలు ఎక్కువ అయిపోగా.. లేటెస్ట్‌గా దేశవ్యాప్తంగా మంచి పనులు చెయ్యడంలో ఫేమస్ అయిన నటుడు సోనూ సూద్ పేరిట సోనూసూద్ ఫౌండేషన్‌ అంటూ కొందరు కేటుగాళ్లు మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సాయం కోసం సంప్రదించిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు.

సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో గూగుల్‌లో తప్పుడు నంబర్లు ఇచ్చి అక్రమార్కులు తప్పుడు ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీల ద్వారా సోనూసూద్ ఫౌండేషన్ అని టైప్ చేస్తే.. ఈ వివరాలు వచ్చేలా చేసి నమ్మిన వాళ్లను మోసం చేస్తున్నారు.. అవే నిజమని నమ్మిన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.. సోనూసూద్ ఫౌండేషన్ ప్రతినిధులను సాయం కోసం సంప్రదించాడు. హిందీ భాషలో మాట్లాడిన బలిరామ్ అనే వ్యక్తి.. సోనూసౌద్ ఫౌండేషన్ అడ్వైజర్‌గా పరిచయం చేసుకుని, పంకజ్ సింగ్ బదూరియా పేరిట ఓ గుర్తింపు కార్డును బాధితుడి వాట్సప్‌కు పంపాడు.

కష్టంలో ఉన్న మీకు సాయం చేస్తామని ఆధార కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు పంపించాలని కోరగా.. సదరు వ్యక్తి ఆ పని చేశాడు. మీకు రూ.50వేల ఆర్థిక సాయం చేసేందుకు సోనూసూద్ ఒప్పుకున్నారంటూ.. కాకపోతే రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం 8వేల మూడొందల రూపాయలు చెల్లించాలని కోరాడు. నిజమని నమ్మి బాధితుడు డబ్బును తన కుమారుడి ఖాతా నుంచి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేయగా.. తర్వాత మీకు అందే ఆర్థిక సాయం రూ.3.60 లక్షలకు పెరిగిందని నమ్మిస్తూ వచ్చి మొత్తం రూ.60 వేల వరకు బాధితుడి నుంచి వసూలు చేశారు కేటుగాళ్లు.

చివరకు తాను మోసపోయినట్లుగా గుర్తించిన బాధితుడు.. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి.. ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేనట్టారు. ఇటువంటి మోసాలుపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.