Wheat Export Banned: గోధుమల ఎగుమతిని తక్షణమే నిషేదిస్తున్నట్టు ప్రకటించిన భారత్

భారత్ నుంచి గోధుమల ఎగుమతిపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈమేరకు వివరాలు వెల్లడించింది.

Wheat Export Banned: గోధుమల ఎగుమతిని తక్షణమే నిషేదిస్తున్నట్టు ప్రకటించిన భారత్

Export Of Wheat Flour, maida

Wheat Export Banned: భారత్ నుంచి గోధుమల ఎగుమతిపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈమేరకు వివరాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరలు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్టు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈక్రమంలో భారత్ లో ధరల నియంత్రణ మరియు ఆహార భద్రత కోసం తక్షణమే గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నోటిఫికేషన్ తేదీలోగానీ లేదా అంతకు ముందుగానీ మార్చలేని క్రెడిట్ లెటర్స్ (LoC) జారీ చేయబడిన గోధుమ ఎగుమతులు అనుమతించబడతాయని DGFT తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Other Stories:Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం

ఇతర దేశాలకు వారి ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి మరియు వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా భారత ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా కూడా ఎగుమతులు కొనసాగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకుంటున్న పలు పరిణామాల నేపథ్యంలో ఆహార ధాన్యం విలువ పెరిగిపోయిందని, ఈక్రమంలో భారత్ సహా ఇతర మిత్ర దేశాల్లో ఆహార కొరత ఏర్పడకుండా చూసుకోవాల్సిన భాద్యత భారత్ పై ఉందని DGFT భావించింది. కాగా 2022-23కి గానూ భారత్ నుంచి 10 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర వాణిజ్యశాఖ..అకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాలతో గోధుమల ఎగుమతిపై వెనక్కు దగ్గింది.

Other Stories:inflation Race : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం..విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు

దేశీయంగా ప్రైవేటు దళారుల కొనుగోళ్లు, మొత్తం ఉత్పత్తిలో కొరత ఈ ఏడాది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద గోధుమ నిల్వలు పడిపోయాయి. ఫలితంగా, జనవరి 2010 తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అటా(గోధుమ పిండి) ధరలు గరిష్ట స్థాయికి పెరిగాయి. దేశంలో గోధుమ ధరల నియంత్రణపై హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం క్వింటా గోధుమల ధర రూ.2400కి చేరుకుంది. ఇది కేంద్రం విధించిన కనిష్ట మద్దతు ధర కంటే ఎక్కువ కావడం గమనార్హం.