inflation Race : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం..విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు

దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలకు అద్దం పట్టేలా ప్రభుత్వ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. మార్చిలో 6.95 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్​లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అని ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం..కరోనా మహమ్మారి దుష్పరిణామాలు..ఎనిమిదేళ్ల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం..వెరసి దేశంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

inflation Race : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం..విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు

Rising Inflation In India (2)

inflation Rising : దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలకు అద్దం పట్టేలా ప్రభుత్వ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడ్డాయి. మార్చిలో 6.95 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్​లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అని ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి.

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం..కరోనా మహమ్మారి దుష్పరిణామాలు..ఎనిమిదేళ్ల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం..వెరసి దేశంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. వంట నూనెల ధరలు, ఇంధన ధరలు భగ్గుమనడంతో.. దేశీయంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. ఏప్రిల్ నెలకు చెందిన రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక బేసిస్‌లో 7.79 శాతానికి పెరిగినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ డేటాలో వెల్లడైంది. ఇంధన ధరలు పెరగడంతో అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి. వంట గ్యాస్ రేట్లు మండిపోతున్నాయి. ఈ ప్రభావం అన్నింటిపై ఉంటోంది. ఆయిల్ రేట్లు పెరగడం రవాణా ఖర్చులపై పడుతోంది. దీంతో అన్ని రేట్లు పెరుగుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. 22 రకాల ఫుడ్ ఐటమ్స్‌లో 13 ఐటమ్స్ ధరలు పెరిగినట్టు వినియోగదారుల వ్యవహారాల విభాగంలో తేలింది. దీనిలో పాలు, సన్ ఫ్లవర్ ఆయిల్, టమాటా ధరలు లాంటివి పెరిగాయి.

రెండేళ్ల కిందట లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ 70 రూపాయలకు అటూఇటూగా ఉండేది. ఇప్పుడది రెండు వందలు దాటిపోయింది. కానీ తగినంత అందుబాటులో ఉందా అంటే.. సూపర్ మార్కెట్లలో ఐదు లీటర్ల క్యాన్లే కనిపించడం లేదు. యుక్రెయిన్ యుద్ధం కారణం అని చెబుతున్నారు కానీ.. ఇంత పెద్ద మన దేశం సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం యుక్రెయిన్ మీద అంత స్థాయిలో ఆధారపడ్డామా? నిజమే అయితే ఇతర వంట నూనెల ధరలు ఎందుకు పెరిగాయి. పెరిగింది ఒక్క వంట నూనే కాదు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. 2021తో పోలిస్తే గ‌త నెల రిటైల్ ద్రవ్యోల్బ‌ణం స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది. వంట నూనెలు, ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో ఏప్రిల్ 2022 చిల్లర ద్రవ్యోల్బణం 7.79 శాతానికి దూసుకెళ్లింది. 2014 మే తర్వాత అధిక రిటైల్ ద్రవ్యోల్బణం న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతంగా రికార్డైంది. ద్రవ్యోల్బణం ఆరు శాతం క‌టాఫ్‌గా ఆర్బీఐ నిర్దేశించుకుంది. ఈ క‌టాఫ్‌ను మార్క్‌ను దాటి 2022 ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిపోవ‌డంతో ఆర్థికవేత్తల్లో ఆందోళ‌న మొద‌లైంది. గ‌త మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 6.95 శాతానికి చేరుకుంది. దీనికితోడు అన్ని నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో గ‌త‌వారం ఆర్బీఐ ద్రవ్య ప‌ర‌ప‌తి క‌మిటీ అక‌స్మాత్తుగా స‌మావేశ‌మై రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచింది. 2018 అక్టోబ‌ర్ త‌ర్వాత ఆర్బీఐ రెపోరేట్ పెంచ‌డం ఇదే తొలిసారి. ఈ శాతాల్లో చెబితే సామాన్యులకు అర్థం కాదు కానీ.. పెరిగిన రేట్ల వారీగా చూస్తే.. ఆరు నెలల్లో నిత్యావసర వస్తువుల రేట్లు సగానిపైగా పెరిగిపోయాయి. అందుకే ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. ఇది శ్రీలంక సంక్షోభం తొలి నాళ్లలో ఉన్న పరిస్థితిలానే ఉంది. అందుకే దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగారు.

ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరోపక్క పడిపోతున్న వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాల్ని ఇప్పటికే ప్రభావితం చేయడం ప్రారంభించాయి. వినియోగ వస్తువుల తయారీ రంగం ఇప్పటికీ నేల చూపులు చూస్తున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్‌లో సరుకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్‌లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. దీనికి అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, వేతనాలు పడిపోవడం ముఖ్య కారణాలు.

ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి మొత్తం పిండుకోవడం కూడా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడటానికి మరో కారణం. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆ భారాన్ని కంపెనీలు భరించవు. వాటిని వినియోగదారులపైకే నెట్టివేస్తాయి. ఇలా అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్‌ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత నలబై రోజుల్లో 14సార్లు పెంచింది. యుక్రెయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపి వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు మండుతున్నాయి. ఏప్రిల్‌లో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా 1.68 ల‌క్షల కోట్ల జీఎస్టీ వ‌సూలైంది. గ‌తేడాది జూలై నుంచి 1.10 ల‌క్షల కోట్లు వ‌సూలయ్యాయి. జీఎస్టీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చాక ప‌న్ను వ‌సూళ్లు 1.5 ల‌క్షల కోట్లు దాట‌డం ఇదే తొలిసారి. గ‌త‌నెల‌లో 1.42 ల‌క్షల కోట్ల పై చిలుకు వ‌సూల‌య్యాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సమయంలో ఇంత భారీగా పన్ను వసూళ్లు ఎలా సాధ్యమయ్యాయి? పెరుగుతున్న ధరలతో పాటుగా ప్రభుత్వ పన్ను కూడా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా ప్రజల్ని పీడిస్తున్నారు. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిపోతోంది. అంటే ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందన్నమాట. ఈ విషయాన్ని గుర్తించని ప్రభుత్వాలు.. అత్యధిక పన్నుల వసూళ్లే అభివృద్ధికి ఆనవాళ్లన్నట్లుగా ఘనంగా ప్రకటించుకుంటున్నాయి.