Andhra Pradesh : ఏపీలో పండుగ వేళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.30వేల నుంచి 60వేలు..
Andhra Pradesh : సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బందికి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
Nara Chandrababu Naidu
Andhra Pradesh : సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసు సిబ్బందికి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవ్‌ల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. ఒక్కో ఉద్యోగికి రూ. 30వేల నుంచి 70వేల వరకు బ్యాంక్ అకౌంట్లలో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్ బిల్లులు కూడా రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధిచేకూరుతోంది.
Also Read : Vemireddy Couple: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?
ఏపీ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీఏ, డీఆర్ బకాయిలతో పాటు పోలీసుల సరెండర్ లీవ్‌లకు సంబంధించిన నిధులు మొత్తం రూ.2,653 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసమే రూ.1,100 కోట్లు కేటాయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాురు 2.25లక్షల మంది సీసీఎస్ ఉద్యోగులు, 2.70లక్షల మంది పెన్షనర్లు, 55వేల మంది పోలీస్ సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. పండగపూట వారి అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, పోలీసు సిబ్బందికి వారి సీనియారిటీని బట్టి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.70వేల నుంచి రూ. 80వేల వరకు నగదు జమ అయినట్లు తెలిసింది.
పండుగ పూట భారీ మొత్తంలో నగదు జమ అవుతుండటంతో ఉద్యోగులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కూటమి ప్రభుత్వం కేవలం ఉద్యోగులకే కాకుండా.. గతంలో పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను కూడా క్లియర్ చేస్తుంది.
