India Corona : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 90,928 పాజిటివ్ కేసులు, 325 మరణాలు

దేశంలో ప్రస్తుతం 2,85,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 0.81శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 6.43 శాతానికి చేరుకుంది.

India Corona : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 90,928 పాజిటివ్ కేసులు, 325 మరణాలు

Corona (1)

India new corona cases : భారత్ లో ఒకవైపు ఒమిక్రాన్ వణికిస్తుంటే.. మరోవైపు కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకూ భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజు వారి కరోనా పాజిటివ్ కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు, 325 మరణాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో ప్రస్తుతం 2,85,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 0.81శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 6.43 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 3,51,09,286 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 4,82,876 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 97.81 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. నిన్న 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,43,41,009 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Fire Broke Out : అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి 13మంది సజీవదహనం

దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,665 కొత్త కోవిడ్ కేసులు,8 మరణాలు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లోనే కేసులు రెట్టింపు అవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఢిల్లీలో 5481 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

బుధవారం 94శాతం పెరిగి 10,665 కేసులు నమోదయ్యాయి. అయితే మే-12 తర్వాత ఢిల్లీలో అత్యధిక కోవిడ్ కేసులు ఇవేనని తెలిపింది. ఇక, జూన్-26 తర్వాత ఇవేళ అత్యధికంగా 8 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ఇక,మే-14 తర్వాతే ఇవాళ అత్యధికంగా 11.88శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది.

Rajya Sabha Members : ఈ ఏడాది పూర్తికానున్న 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం

మరోవైపు దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మృతి చెందిన వ్యక్తి పేరు లక్ష్మీ నారాయణ(73)అని తెలిపారు. డిసెంబర్-15న అతడికి కరోనా పాజిటివ్ గా తేలిందని..అప్పటి నుంచి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడని తెలిపారు.