unemployment: దేశంలో 7.8 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

దేశంలో గత ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 7.83 శాతంగా నమోదైంది. మార్చిలో 7.60 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా, ఈ ఏప్రిల్‍లో ఇది స్వల్పంగా పెరిగింది.

unemployment: దేశంలో 7.8 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

Unemployment

unemployment: దేశంలో గత ఏప్రిల్ నెలలో నిరుద్యోగ రేటు 7.83 శాతంగా నమోదైంది. మార్చిలో 7.60 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా, ఈ ఏప్రిల్‍లో ఇది స్వల్పంగా పెరిగింది. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ)’ సర్వే ప్రకారం ఏప్రిల్ నెలలో పట్టణ నిరుద్యోగ రేటు 9.22 శాతంగా నమోదైంది. ఇది మార్చి నెలకంటే కొంచెం ఎక్కువ. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. మార్చిలో 7.29 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో 7.18 శాతంగా నమోదైంది.

Central Govt : ఎలక్ట్రిక్‌ బైకులపై కేంద్రం కీలక నిర్ణయం

రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధికంగా హరియాణాలో 34.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, రాజస్తాన్‌లో 28.8 శాతం నిరుద్యోగం నమోదైంది. ఆర్థిక ప్రగతి మందగించడం కారణంగా నిరుద్యోగం పెరిగిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సీఎమ్ఐఈ.. ముంబైకి చెందిన సంస్థ. ఇది దేశంలోని ఆర్థిక ప్రగతి, నిరుద్యోగం వంటి అంశాల్ని పరిశీలిస్తుంది.