Central Govt : ఎలక్ట్రిక్‌ బైకులపై కేంద్రం కీలక నిర్ణయం

ఇప్పటికే బైకుల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీపై కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సూచనలు చేశారు. తాజాగా కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Central Govt : ఎలక్ట్రిక్‌ బైకులపై కేంద్రం కీలక నిర్ణయం

Nitin Gadkari (1)

central government : ఎలక్ట్రిక్‌ బైకులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొత్త మోడల్స్ లాంచ్‌ చేయవద్దంటూ ఎలక్ట్రిక్‌ బైకుల కంపెనీలకు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న మోడల్స్‌ను మాత్రమే అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది. వరుసగా ఎలక్ట్రిక్‌ బైకులు పేలుతుండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. e-బైక్స్‌లో బ్యాటరీలు పేలడంపై నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత గైడ్‌లైన్స్ తయారు చేయనుంది. ఎలక్ట్రిక్‌ బైకులు పేలితే సీరియస్‌గా పరిగణిస్తామంటూ ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్‌ ఇచ్చారు.

పెట్రోల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. కరెంటుతో చార్జ్‌ చేసుకోవడం, తక్కువ ఖర్చుతో అవసరం తీరడంతో జనం ఈ బైక్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాలు తరుచూ పేలడం కలవరపెడుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలి ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది.

Electric Bike Explodes : బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

ఇప్పటికే బైకుల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీపై కంపెనీలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సూచనలు చేశారు. తాజాగా కొత్త మోడల్స్ లాంచ్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒక బైక్ బ్యాటరీ పేలితే…ఆ బ్యాచ్‌లో తయారైన మిగతా వాహనాలను కూడా రీకాల్ చేయాలని ఆదేశించింది.