iPhone 13 Big Discount : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

iPhone 13 Big Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్‌ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా Apple iPhone 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈసారి ఆఫర్ పూర్తిగా బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై ఆధారపడి ఉండదని గమనించాలి.

iPhone 13 Big Discount : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

iPhone 13 gets big discount during Flipkart Black Friday sale

iPhone 13 Big Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్‌ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా Apple iPhone 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈసారి ఆఫర్ పూర్తిగా బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై ఆధారపడి ఉండదని గమనించాలి. తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త 6 రోజుల సేల్ నిర్వహిస్తోంది. అనేక డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇందులో iPhone 13, iPhone 12, iPhone 14 కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో iPhone 13పై 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 62,999 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గతంలో రూ. 65,999కి సేల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యూజర్లందరికి రూ. 3వేల ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1,000 డిస్కౌంట్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 17,500 వరకు అందుబాటులో ఉంది.

iPhone 13 gets big discount during Flipkart Black Friday sale

iPhone 13 gets big discount during Flipkart Black Friday sale

అమెజాన్ వంటి ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఐఫోన్ 13 ను రూ. 66,900 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కొత్త ఐఫోన్ 14ను రూ. 77,400 తగ్గింపు ధరతో అందిస్తోంది. ఇప్పటికీ చాలా ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. రెండు ఐఫోన్‌లు ఒకేలా ఉంటాయి. ఐఫోన్ ఫీచర్లు, డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా ఒకే విధంగా ఉన్నందున పాత వెర్షన్‌ని కొనుగోలు చేయవచ్చు. రూ. 60వేల కన్నా ఎక్కువ ఖర్చు చేయలేని వారు ఐఫోన్ 12 కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 64GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ. 48,999కి విక్రయిస్తోంది. ఐఫోన్ 12 మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 53,999కి సేల్ అందుబాటులో ఉంది.

iPhone 13 gets big discount during Flipkart Black Friday sale

iPhone 13 gets big discount during Flipkart Black Friday sale

ఆపిల్ ఈ ఐఫోన్‌లలో దేనితోనూ ఛార్జర్‌ను అందించడం లేదని గమనించాలి. అందుకే ఐఫోన్ కస్టమర్‌లు ఛార్జర్ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంకా, కంపెనీ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్టును అందించింది. ఆపిల్ ఛార్జర్‌ను భారత మార్కెట్లో రూ.1,900కి విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఇప్పటికే లైవ్‌లో ఉంది. నవంబర్ 30 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కూడా డీల్‌లు ఉన్నందున కొనుగోలుదారులు ఐఫోన్ కొనాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకోవడానికి కొంత సమయం ఉంది. Samsung Galaxy S22 అమెజాన్‌లో రూ. 52,999లకే అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైందోచ్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. వైర్‌లెస్ ఇయర్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు..!