IPL 2023:చెన్నై పై కోల్‌క‌తా విజ‌యం

ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జరిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది.

IPL 2023:చెన్నై పై కోల్‌క‌తా విజ‌యం

CSK vs KKR

Updated On : May 14, 2023 / 11:08 PM IST

CSK vs KKR:ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జరిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 May 2023 11:08 PM (IST)

    కోల్‌క‌తా విజ‌యం

    ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జరిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా 18.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 14 May 2023 10:58 PM (IST)

    నితీశ్ రాణా అర్ధ‌శ‌త‌కం

    మ‌హేష్ తీక్ష‌ణ బౌలింగ్‌లో (16.5వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో కోల్‌క‌తా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు.

  • 14 May 2023 10:53 PM (IST)

    రింకూ సింగ్ అర్ధ‌శ‌త‌కం

    మతీష పతిరన బౌలింగ్‌లో(15.6వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌తకాన్ని పూర్తి చేశాడు రింకు సింగ్‌. ఐపీఎల్‌లో అత‌డికి ఇది మూడో హాఫ్ సెంచ‌రీ

  • 14 May 2023 10:22 PM (IST)

    నిల‌కడ‌గా ఆడుతున్న కోల్‌క‌తా బ్యాట‌ర్లు

    ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను రింకూసింగ్‌, నితీశ్ రాణా లు త‌మ భుజాల‌పై వేసుకున్నారు. వీరిద్ద‌రు నిల‌క‌డ‌గా ఆడుతూ ర‌న్‌రేట్ ప‌డిపోకుండా చూసుకుంటున్నాడు. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 62/3. రింకూ సింగ్‌(24), నితీశ్ రాణా(13)లు క్రీజులో ఉన్నారు.

  • 14 May 2023 10:05 PM (IST)

    జేస‌న్ రాయ్‌ ఔట్

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. జేస‌న్ రాయ్‌(12) ఔట్ అయ్యాడు. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో మతీష పతిరన చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా 33 ప‌రుగుల(4.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 14 May 2023 09:54 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్

    కోల్‌క‌తాకు వ‌రుసగా షాక్‌లు త‌గులుతున్నాయి. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో జ‌డేజా క్యాచ్ అందుకోవ‌డంతో వెంక‌టేశ్ అయ్య‌ర్(9) ఔట్ అయ్యాడు. దీంతో కోల్‌క‌తా 21 ప‌రుగుల(2.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

  • 14 May 2023 09:43 PM (IST)

    రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్‌

    ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన కోల్‌క‌తాకు షాక్ త‌గిలింది. మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి గుర్భాజ్ (1) తుషార్ దేశ్‌పాండే చేతికి చిక్కాడు. 1 ఓవ‌ర్‌కు కోల్‌క‌తా స్కోరు 4/1.

  • 14 May 2023 09:22 PM (IST)

    కోల్‌క‌తా ల‌క్ష్యం 145

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది. శివ‌మ్ దూబే(48 నాటౌట్; 34 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్స‌ర్లు), డెవాన్ కాన్వే(30; 28 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. మిగిలిన వారిలో అంబ‌టి రాయుడు(4), మొయిన్ అలీ(1) లు విఫ‌లం అయ్యారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 14 May 2023 08:33 PM (IST)

    మొయిన్ అలీ ఔట్‌

    చెన్నై వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో మొయిన్ అలీ(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై 72 ప‌రుగుల(10.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 14 May 2023 08:23 PM (IST)

    కాన్వే ఔట్‌

    శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రింకూ సింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో డెవాన్ కాన్వే(30) ఔట్ అయ్యాడు. దీంతో 66 ప‌రుగుల(9.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది.

  • 14 May 2023 08:14 PM (IST)

    ర‌హానే ఔట్‌

    చెన్నై మ‌రో వికెట్ కోల్పోయింది. 61 ప‌రుగుల(7.6వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్ ప‌డింది. ర‌హానే(16) ఔట్ అయ్యాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో జేస‌న్ రాయ్ చేతికి చిక్కాడు.

  • 14 May 2023 08:03 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    చెన్నై ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. 6 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 52/1. అజింక్యా ర‌హానే(12), డెవాన్ కాన్వే (23) క్రీజులో ఉన్నారు.

  • 14 May 2023 07:53 PM (IST)

    రుతురాజ్ ఔట్‌

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 31 ప‌రుగుల(3.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చాడు.

  • 14 May 2023 07:09 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు

    రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

  • 14 May 2023 07:09 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), జేసన్ రాయ్, నితీష్ రాణా(కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

  • 14 May 2023 07:07 PM (IST)

    టాస్ గెలిచిన చెన్నై

    టాస్ గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.