Ajinkya Rahane: ఏబీడీ, బట్లర్, వార్నర్ ను మిక్స్ చేసినట్టు.. రప్ఫాడించిన రహానే
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రహానే శివమెత్తాడు. 29 బంతుల్లో 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

Ajinkya Rahane (Photo: @ChennaiIPL)
Ajinkya Rahane: ఐపీఎల్ తాజా సీజన్ లో చెలరేగిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అజింక్య రహానేపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్యాట్ తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అతడిని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఎక్కడున్నాడో తెలియని స్థాయి నుంచి మెరుపు ఇన్నింగ్స్ తో మళ్లీ వెలుగులోకి దూసుకొచ్చిన అతడిని టీమిండియాకు ఎంపిక చేయాలన్న వాదనలు విన్పిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కు పంత్ స్థానంలో రహానేను ఎంపిక చేయాలని కోరుతున్నారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రహానే శివమెత్తాడు. 29 బంతుల్లో 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ఐపీఎల్ (IPL 2023) లో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన రహానే 199 స్ట్రైక్ రేట్ తో 209 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ ఐపీఎల్ లోనే అతడు అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేయడం విశేషం. తర్వాతి మ్యాచ్ ల్లోనూ ఇదే హవా కొనసాగిస్తే రహానే (Rahane) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
రహానే 2.o
కేకేఆర్(KKR) తో జరిగిన మ్యాచ్ లో రప్ఫాడించిన రహానేపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రహానే (Ajinkya Rahane) విజృంభన చూసి అతడిని 2.o వెర్షన్ గా అభివర్ణిస్తున్నారు. ఏబీడీ, బట్లర్, వార్నర్ ను మిక్స్ చేస్తే అది.. రహానే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో పలువురు ఆటగాళ్లపై సెటైర్లు కూడా వేస్తున్నారు. ఐపీఎల్ వేలంలో రూ.3.8 కోట్లు పలికిన రియాన్ పరాగ్ (riyan parag) దారుణంగా విఫలమయ్యాడని.. కేవలం రూ.50 లక్షలు పెట్టి కొన్న రహానే మాత్రం చెలరేగిపోతున్నాడని అంటున్నారు.
Also Read: ఈడెన్‌లో చెన్నై జోరు.. కోల్‌కతాపై ఘన విజయం
ధోని కెప్టెన్సీ వల్లే..
అయితే తన నుంచి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇంకా రాలేదని రహానే అన్నాడు. ఎంఎస్ ధోని (MS Dhoni) నాయకత్వంలో ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటారని, అతడి కెప్టెన్సీలో తాను ఎంతో మెరుగయ్యానని రహానే వినమ్రంగాచెప్పాడు. ఎవరు ఏమీ చెప్పినా ధోని ఓపిగ్గా వింటాడని వెల్లడించాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మరో నాలుగు అవార్డులు రహానే సొంతం చేసుకున్నాడు. తర్వాతి మ్యాచ్ ల్లో ఇదే జోరు కొనసాగించాలని సీఎస్కే(CSK) అభిమానులు కోరుకుంటున్నారు.
“My best is yet to come”- Ajinkya Rahane today? pic.twitter.com/SbpN6zc8wl
— Foresay Sports (@ForesayCricket) April 23, 2023