IPL 2023, KKR vs CSK: ఈడెన్‌లో చెన్నై జోరు.. కోల్‌క‌తాపై ఘ‌న విజ‌యం

IPL 2023, KKR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 49 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023, KKR vs CSK: ఈడెన్‌లో చెన్నై జోరు.. కోల్‌క‌తాపై ఘ‌న విజ‌యం

csk win

IPL 2023, KKR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 49 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌లో కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో జేస‌న్ రాయ్‌(61; 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), రింకూసింగ్‌(53నాటౌట్‌; 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించారు. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌ పాండే, మ‌హేశ్ తీక్ష‌ణ‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా ప‌తిర‌న‌, ఆకాశ్ సింగ్, మోయిన్ అలీ,ర‌వీంద్ర జ‌డేజాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో అజింక్యా ర‌హానే(71నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శివ‌మ్ దూబే(50; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) పెను విధ్వంసం సృష్టించింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో కుల్వంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

IPL 2023, KKR Vs CSK: కోల్‌క‌తాపై చెన్నై ఘ‌న విజ‌యం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఓపెన‌ర్లు డేవాన్ కాన్వే(56; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్‌(35; 20 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్స‌ర్లు) లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 7.3 ఓవ‌ర్ల‌లోనే 73 ప‌రుగులు జోడించారు. రుతురాజ్‌ను సుయాశ్ శర్మ ఔట్ చేశాడు. దీంతో కాన్వేకు ర‌హానే జ‌త క‌లిశాడు. వీరిద్ద‌రు వీలుచిక్క‌న‌ప్పుడల్లా బంతిని బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో కాన్వే 34 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు.

ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న వీరి జోడిని వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి విడ‌దీశాడు. భారీ షాట్‌కు య‌త్నించిన కాన్వే డేవిస్ వైస్ చేతికి చిక్కాడు. దీంతో 36 ప‌రుగుల రెండో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఈ ఆనందం కోల్‌క‌తాకు ఎక్కువ సేపు మిగ‌ల‌లేదు. ర‌హానేతో జ‌త క‌లిసిన దూబే కోల్‌క‌తా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. అప్ప‌టి వ‌ర‌కు కాస్త స్లో ఆడిన ర‌హానే వేగం పెంచాడు. ఇద్ద‌రు పోటీప‌డి బౌండ‌రీలు బాదారు. నువ్వు ఒక‌టి కొడితే నేను రెండు సిక్స‌ర్లు కొడుతా అన్న‌ట్లుగా వీరి ఇన్నింగ్స్ సాగింది.

IPL 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ .. మరోవారం రోజులు జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ ..

వ‌చ్చిన బంతి వ‌చ్చిన‌ట్లూ బౌండ‌రీకి పంపించారు. వీరి ధాటికి చెన్నై స్కోరు రాకెట్ వేగంతో ప‌రుగులు తీసింది. మొద‌ట ర‌హానే 24 బంతుల్లో, ఆ త‌రువాత దూబే 20 బంతుల్లో అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. హాప్ సెంచ‌రీ త‌రువాత మ‌రో భారీ షాట్‌కు య‌త్నించి దూబే ఔటైయ్యాడు. ర‌హానే-దూబే జోడి కేవ‌లం 32 బంతుల్లోనే మూడో వికెట్‌కు 85 ప‌రుగులు జోడించింది. దూబే ఔటైనా ర‌వీంద్ర జ‌డేజా(18; 8 బంతుల్లో 2సిక్స‌ర్లు) తో క‌లిసి ర‌హానే చెన్నైకు భారీ స్కోరు అందించాడు.