IPL 2023, KKR Vs CSK: కోల్‌క‌తాపై చెన్నై ఘ‌న విజ‌యం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది.

IPL 2023, KKR Vs CSK: కోల్‌క‌తాపై చెన్నై ఘ‌న విజ‌యం

MS Dhoni, Nitish Rana

IPL 2023, KKR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 49 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌లో కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో జేస‌న్ రాయ్‌(61; 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), రింకూసింగ్‌(53నాటౌట్‌; 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించారు. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌ పాండే, మ‌హేశ్ తీక్ష‌ణ‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా ప‌తిర‌న‌, ఆకాశ్ సింగ్, మోయిన్ అలీ,ర‌వీంద్ర జ‌డేజాలు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 23 Apr 2023 11:26 PM (IST)

    చెన్నై ఘ‌న విజ‌యం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌లో కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది.

  • 23 Apr 2023 11:19 PM (IST)

    ఉమేశ్ యాద‌వ్ ఔట్‌

    మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో భారీ షాట్ కు య‌త్నించిన‌ ఉమేశ్ యాద‌వ్(4) డేవాన్ కాన్వే చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా 180 ప‌రుగుల వ‌ద్ద(18.3వ ఓవ‌ర్‌) ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 180/8. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(1), రింకూ సింగ్‌(47) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 11:12 PM (IST)

    డేవిడ్ వైస్ ఔట్‌

    తుషార్ దేశ్‌ పాండే బౌలింగ్‌లో డేవిడ్ వైస్(1) ఎల్భీగా పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో కోల్‌క‌తా 171 ప‌రుగుల వ‌ద్ద(17.3వ ఓవ‌ర్‌) ఏడో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 177/7. ఉమేశ్ యాద‌వ్(4), రింకూ సింగ్‌(44) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 11:05 PM (IST)

    ర‌స్సెల్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. ప‌తిర‌న బౌలింగ్‌లో శివ‌మ్ దూబే క్యాచ్ అందుకోవ‌డంతో ర‌స్సెల్‌(9) ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో కోల్‌క‌తా 162 ప‌రుగుల వ‌ద్ద(16.4వ ఓవ‌ర్‌) ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 164/6. డేవిడ్ వైస్(1), రింకూ సింగ్‌(37) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:57 PM (IST)

    రింకూ సింగ్ రెండు ఫోర్లు, ర‌స్సెల్ సిక్స్‌

    తుషార్ దేశ్‌ పాండే బౌలింగ్‌లో రెండు, మూడు బంతుల‌ను రింకూ సింగ్ బౌండ‌రీలుగా మ‌ల‌చ‌గా ఆఖ‌రి బంతికి ర‌స్సెల్ సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 19 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 156/5. ర‌స్సెల్‌(9), రింకూ సింగ్‌(31) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:50 PM (IST)

    జేస‌న్ రాయ్ ఔట్‌

    కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు ఫోర్లు కొట్టిన జేస‌న్ రాయ్ మ‌రో షాట్‌కు య‌త్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చెన్నై 135 ప‌రుగుల వ‌ద్ద(14.4వ ఓవ‌ర్‌) ఐదో వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 137/5. ర‌స్సెల్‌(1), రింకూ సింగ్‌(22) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:46 PM (IST)

    జేస‌న్ రాయ్ అర్ధ‌శ‌త‌కం

    పతిరన బౌలింగ్‌లో మొద‌టి బంతిని ఫోర్ కొట్టి 19 బంతుల్లోనే జేస‌న్ రాయ్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 127/4. జేసన్ రాయ్(53) , రింకూ సింగ్‌(21) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:41 PM (IST)

    10 ప‌రుగులు

    ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి రింకూ సింగ్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 119 /4. జేసన్ రాయ్(47) , రింకూ సింగ్‌(20) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:38 PM (IST)

    జేస‌న్ రాయ్ దూకుడు

    జేస‌న్ రాయ్ దూకుడుగా ఆడుతున్నాడు. మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో ఓ ఫోరు, ఓ సిక్స్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో14 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 109 /4. జేసన్ రాయ్(45) , రింకూ సింగ్‌(12) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:34 PM (IST)

    రెండు సిక్స్‌లు, ఫోర్

    కోల్‌క‌తా బ్యాట‌ర్లు కాస్త దూకుడు పెంచుతున్నారు. జ‌డేజా బౌలింగ్‌లో తొలి రెండు బంతుల‌కు జేస‌న్ రాయ్ సిక్స్‌, ఫోర్ కొట్ట‌గా నాలుగో బంతికి రింకూ సింగ్ సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 19 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 95 /4. జేసన్ రాయ్(33) , రింకూ సింగ్‌(10 క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:31 PM (IST)

    5 ప‌రుగులు

    ప‌దో ఓవ‌ర్‌ను పతిరన వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు76 /4. జేసన్ రాయ్(21) , రింకూ సింగ్‌(3) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:20 PM (IST)

    నితీశ్ రాణా ఔట్

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో నితీశ్ రాణా(27) భారీ షాట్‌కు య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద రుతురాజ్ గైక్వాడ్ చేతికి చిక్కాడు. దీంతో 70 ప‌రుగుల వ‌ద్ద(8.2వ ఓవ‌ర్‌) కోల్‌క‌తా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు71 /4. జేసన్ రాయ్(19) , రింకూ సింగ్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:13 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. మోయిన్ అలీ బౌలింగ్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్(20) ఎల్బీగా పెవిలియ‌న్ చేరాడు. దీంతో 46 ప‌రుగుల వ‌ద్ద(7.1వ ఓవ‌ర్‌) కోల్‌క‌తా మూడో వికెట్ కోల్పోయింది. అనంత‌రం వ‌చ్చిన జేస‌న్ రాయ్ హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. 8 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 66/3. జేసన్ రాయ్(19) , నితీశ్ రాణా(23) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:10 PM (IST)

    8 ప‌రుగులు

    ఆకాశ్‌ సింగ్ ఏడో ఓవ‌ర్‌ను వేయ‌గా తొలి బంతికి నితీశ్ రాణా ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 46/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(20), నితీశ్ రాణా(22) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:04 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    కోల్‌క‌తా ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను మ‌హేశ్ తీక్ష‌ణ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 38/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(18), నితీశ్ రాణా(16) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 10:00 PM (IST)

    నితీశ్ రాణా రెండు ఫోర్లు

    ఆకాశ్‌ సింగ్ వేసిన ఐదో ఓవ‌ర్‌లో నితీశ్ రాణా రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 9 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 33/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(16), నితీశ్ రాణా(14) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 09:55 PM (IST)

    నితీశ్ రాణా ఫోర్‌

    తుషార్ దేశ్‌ పాండే వేసిన నాలుగో ఓవ‌ర్‌లో నితీశ్ రాణా ఓ ఫోర్ కొట్టాడు. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 24/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(11), నితీశ్ రాణా(10) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 09:51 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ సిక్స్‌, ఫోర్‌

    ఆకాశ్‌ సింగ్ వేసిన మూడో ఓవ‌ర్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ వ‌రుస‌గా సిక్స్‌, ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 11 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 20/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(11), నితీశ్ రాణా(6) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 09:43 PM (IST)

    జ‌గ‌దీశన్ ఔట్‌

    చెన్నై బౌల‌ర్ల దాటికి కోల్‌క‌తా వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. తుషార్ దేశ్‌ పాండే బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన జ‌గ‌దీశ‌న్(1) జ‌డేజా చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా ఒక్క ప‌రుగు వ‌ద్దే(1.2వ ఓవ‌ర్‌) రెండో వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 9/2. వెంక‌టేశ్ అయ్య‌ర్‌(1), నితీశ్ రాణా(6) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 09:37 PM (IST)

    సునీల్ న‌రైన్ ఔట్‌

    భారీ ల‌క్ష్యాన్నిఛేదించేందుకు కోల్‌క‌తా బ‌రిలోకి దిగింది. సునీల్ న‌రైన్‌, జగదీశన్ ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను ఆకాశ్‌ సింగ్ వేశాడు. నాలుగో బంతికి సునీల్ న‌రైన్‌(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌క‌తా ఒక్క ప‌రుగుకే మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 23 Apr 2023 09:20 PM (IST)

    కోల్‌క‌తా లక్ష్యం 236

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాట‌ర్లు దంచికొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి చెన్నై 235 ప‌రుగులు చేసింది.

  • 23 Apr 2023 09:10 PM (IST)

    ర‌హానే రెండు సిక్సులు, ఓఫోర్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో ఆఖ‌రి మూడు బంతుల‌కు ర‌హానే వ‌రుస‌గా 6,6,4 బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 19 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 218/3. జ‌డేజా(4), అజింక్యా ర‌హానే(71) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 09:02 PM (IST)

    దూబే అర్ధ‌శ‌త‌కం.. ఆ వెంట‌నే ఔట్

    కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్‌లో రెండో బంతికి సిక్స్ కొట్టిన దూబే 20 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేశాడు, అయితే.. ఆ మ‌రుస‌టి బంతికే మ‌రో భారీ షాట్‌కు య‌త్నించి జేస‌న్ రాయ్ చేతికి చిక్కాడు. దీంతో చెన్నై 194 ప‌రుగుల వ‌ద్ద‌(17.3వ ఓవ‌ర్‌) మూడో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 199/3. జ‌డేజా(0), అజింక్యా ర‌హానే(55) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 09:00 PM (IST)

    ర‌హానే అర్థ‌శ‌త‌కం

    ర‌హానే దూకుడుగా ఆడుతున్నాడు. రస్సెల్ బౌలింగ్‌లో రెండో బంతికి సిక్స్ కొట్టిన ర‌హానే ఆఖ‌రి బంతికి ఫోర్ బాది 24 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 186/2. శివ‌మ్ దూబే(42), అజింక్యా ర‌హానే(51) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:50 PM (IST)

    దూబే భారీ సిక్స‌ర్‌

    సుయాశ్ శర్మ బౌలింగ్‌లో శివమ్ దూబే భారీ సిక్స‌ర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 169/2. శివ‌మ్ దూబే(40), అజింక్యా ర‌హానే(38) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:45 PM (IST)

    దూబే సిక్స్‌, ఫోర్‌

    డేవిడ్ వైస్ బౌలింగ్‌లో శివ‌మ్ దూబే తొలి రెండు బంతుల‌ను సిక్స్‌, ఫోర్‌గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 160/2. శివ‌మ్ దూబే(32), అజింక్యా ర‌హానే(37) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:40 PM (IST)

    22 ప‌రుగులు

    ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్‌లో అజింక్యా ర‌హానే వ‌రుస‌గా రెండు సిక్స్‌లు, ఓఫోర్ కొట్ట‌గా దూబే ఓ ఫోర్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 22 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 145/2. శివ‌మ్ దూబే(18), అజింక్యా ర‌హానే(36) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:30 PM (IST)

    కాన్వే ఔట్‌

    చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన కాన్వే(56) బౌండ‌రీ లైన్ వ‌ద్ద డేవిడ్ వైస్ చేతికి చిక్కాడు. దీంతో చెన్నై 109 ప‌రుగుల వ‌ద్ద(12.1వ ఓవ‌ర్‌) రెండో వికెట్‌ను కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 123/2. శివ‌మ్ దూబే(13), అజింక్యా ర‌హానే(19) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:27 PM (IST)

    ర‌హానే ఫోర్‌

    సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ర‌హానే ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 8 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 109/1. డేవాన్ కాన్వే(56), అజింక్యా ర‌హానే(18) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:22 PM (IST)

    కాన్వే ఫోర్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో కాన్వే ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 7 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 101/1. డేవాన్ కాన్వే(55), అజింక్యా ర‌హానే(11) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:17 PM (IST)

    కాన్వే అర్ధ‌శ‌త‌కం

    సుయాశ్ శర్మ బౌలింగ్‌లో సింగిల్ తీసి 34 బంతుల్లో కాన్వే అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 10 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 94/1. డేవాన్ కాన్వే(50), అజింక్యా ర‌హానే(9) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:13 PM (IST)

    10 ప‌రుగులు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి కాన్వే సిక్స్ కొట్ట‌డంతో మొత్తం 10 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 89/1. డేవాన్ కాన్వే(47), అజింక్యా ర‌హానే(7) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:06 PM (IST)

    రుతురాజ్ ఔట్‌.

    సుయాశ్ శర్మ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్(35) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 73 ప‌రుగుల వ‌ద్ద(7.3వ ఓవ‌ర్‌) చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. 8 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 79/1. డేవాన్ కాన్వే(39), అజింక్యా ర‌హానే(5) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 08:04 PM (IST)

    రుతురాజ్ సిక్స్‌, ఫోర్‌

    సునీల్ నరైన్ ఏడో ఓవ‌ర్‌ను వేశాడు. ఆఖ‌రి రెండు బంతుల‌ను రుత్‌రాజ్ గైక్వాడ్ ఫోర్‌, సిక్స్‌గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 72/0. డేవాన్ కాన్వే(37), రుతురాజ్ గైక్వాడ్‌(35) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:59 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    చెన్నై ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. కుల్వంత్ ఖేజ్రోలియా ఆరో ఓవ‌ర్‌ను వేశాడు. కాన్వే ఓ ఫోర్ కొట్ట‌గా రుతురాజ్ గైక్వాడ్ ఓ సిక్స్ కొట్ట‌డంతో మొత్తంగా 16 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 59/0. డేవాన్ కాన్వే(36), రుతురాజ్ గైక్వాడ్‌(23) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:54 PM (IST)

    కాన్వే రెండు ఫోర్లు

    డేవిడ్ వైస్ ఐదో ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో డేవాన్ కాన్వే రెండు ఫోర్లు కొట్టాడంతో మొత్తం 14 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 45/0. డేవాన్ కాన్వే(31), రుతురాజ్ గైక్వాడ్‌(14) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:50 PM (IST)

    కాన్వే సిక్స్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నాలుగో ఓవ‌ర్‌ను వేశాడు. ఐదో బంతిని డేవాన్ కాన్వే సిక్స్ గా మ‌ల‌చ‌డంతో ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 31/0. డేవాన్ కాన్వే(17), రుతురాజ్ గైక్వాడ్‌(14) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:47 PM (IST)

    రుతురాజ్ గైక్వాడ్ సిక్స్‌

    టాస్ ఓడిన చెన్నై బ్యాటింగ్ ఆరంభించింది. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. మూడో ఓవ‌ర్‌ను ఉమేశ్ యాద‌వ్ వేయ‌గా ఈ ఓవ‌ర్‌లో రుతురాజ్ సిక్స్ కొట్ట‌డంతో మొత్తం 8 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 22/0. డేవాన్ కాన్వే(8), రుతురాజ్ గైక్వాడ్‌(14) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:12 PM (IST)

    నితీశ్ రాణా సేన

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: జగదీశన్, జాసన్ రాయ్, నితీశ్ రాణా(కెప్టెన్), రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాశ్ శర్మ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

  • 23 Apr 2023 07:10 PM (IST)

    ధోనీ సేన

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోనీ(కెప్టెన్), మతీషా పతిరణా, తుషార్ దేశ్‌ పాండే, మహేశ్ తీక్షణ

  • 23 Apr 2023 07:01 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్

    టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మొదట బౌలింగ్ ఎంచుకుంది.

  • 23 Apr 2023 06:51 PM (IST)

    కాసేపట్లో టాస్

    కాసేపట్లో టాస్ వేయనున్నారు. టాస్ గెలిచే జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.