Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషికం ఇదే?

అందరినీ దమ్ దమ్ చేస్తానని వందరోజులకు సరిపడా బ్యాగ్ సర్దుకొని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సరయూ పట్టుమని వారం తిరగకుండానే బయటకొచ్చేసింది. కాదు.. కాదు బయటకి నెట్టేశారు.

Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషికం ఇదే?

Bigg Boss 5

Bigg Boss 5: అందరినీ దమ్ దమ్ చేస్తానని వందరోజులకు సరిపడా బ్యాగ్ సర్దుకొని బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సరయూ పట్టుమని వారం తిరగకుండానే బయటకొచ్చేసింది. కాదు.. కాదు బయటకి నెట్టేశారు. అయితే, బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో సరయూ ఏమైనా తక్కువనా అంటే అదేం కాదు అంటారు సోషల్ మీడియా జనాలు. అంతలా ఫాలోయింగ్ సంపాదించుకుంది సరయూ అక్కడ. ఒకరకంగా యూట్యూబ్‌లో పచ్చి బూతులు మాట్లాడుతూ.. తన యాస, భాషలతో ఆకట్టుకుని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టడం సరయూకి వెన్నతో పెట్టిన విద్య.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

మరి అలాంటి సరయూకి తగ్గట్లు ఉండే అభిమానులు ఓటేసినా ఆమె బిగ్ బాస్ ఇంట్లో నుండి బయటకొచ్చేది కాదు. ఏదైనా కానీ ఆమె వెళ్లిన ఒక్క వారానికే ఎలిమినేట్ అయింది. అయితే సరయు.. ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సరయూ సిగరెట్ తాగడమే కారణమని కొందరు.. కాదు ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారని.. లేదు బిగ్ బాస్ రెగ్యులర్ ఆడియన్స్ నుండి సరయూకి ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు వచ్చాయని ఏవేవో చర్చలు సాగుతున్నాయి.

Big Boss 5: సవాళ్లు.. మధ్యలో నానాబూతులు.. ఇది నిజంగా ‘మండే’నే!

బిగ్ బాస్ అంటే నిజానికి యూట్యూబ్ లాంటి ప్లాట్ ఫామ్ కాదు. అంతపెద్ద షోలో పచ్చి బూతులు మాట్లాడ్డం కూడా మరో కారణం అనుకోవచ్చు. అదలా ఉంటే హౌస్ నుండి బయటకొచ్చిన సరయూ కంటెస్టెంట్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరికి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మరింతగా చెలరేగిపోయింది. కాగా, ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో సరయూ పారితోషికం మ్యాటర్ హాట్ టాపిక్ గా మారి వైరల్‌ అవుతోంది. ఈ ప్రచారం ప్రకారం సరయూకి వారం రోజులకు గానూ బిగ్‌బాస్‌ లక్ష రూపాయల పారితోషకం ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.