IT Raids : అఖిలేష్ యాదవ్ అనుచరుడి ఇంటిపై ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులు: 150 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభ్యం

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుడు, గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్ జైన్.. ఇల్లు కార్యాలయాల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

IT Raids : అఖిలేష్ యాదవ్ అనుచరుడి ఇంటిపై ఐటీ, జీఎస్టీ అధికారుల దాడులు: 150 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభ్యం

It Raids

IT Raids : సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుడు, గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్ జైన్.. ఇల్లు కార్యాలయాల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అధికారులు సైతం విస్తుపోయేలా మొత్తం 150 కోట్ల రూపాయలకు పైగా నగదు కట్టలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ మధ్య మాటల యుద్ధంతో పాటు.. మినీ యుద్ధమే నడుస్తుంది. ఎన్నికల వేళ, సమాజ్ వాదీ అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది.

చదవండి : Uttar Pradesh IT Raids : యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్‌ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు

ఇక విషయానికి వస్తే గుజరాత్ కు చెందిన ప్రముఖ పాన్ మసాలా తయారీదారుడు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారవేత్త పీయూష్ జైన్ ఇళ్లపై శుక్రవారం నాడు జీఎస్టీ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో అధికారులు సైతం విస్తుపోయేలా 150 కోట్ల రూపాయలకు పైగా నగదు కట్టలు బయట పడ్డాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, ముంబైల్లోని పీయూష్ కార్యాలయాల్లోనూ, అనుచరుల ఇళ్లలోనూ అధికారులు ఈదాడులు జరిపారు. మొత్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు… ఈ తరహా డబ్బులు కట్టలు లభించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. డబ్బులను లెక్కించేందుకు, ఎస్బీఐ బ్యాంకు సిబ్బందిని, కౌంటింగ్ యంత్రాలను వెంటబెట్టుకు వెళ్లిన అధికారులు… ఈ కౌంటింగ్ శుక్రవారం ఉదయం మొదలు పెట్టగా శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం వరకు పడుతుందని తెలిపారు.

చదవండి : Uttar Pradesh : ఎంత నాణ్యతో..!? : ఓపెనింగ్‌ రోజు టెంకాయ కొడితే పగిలిన కొత్త రోడ్డు

ఇక పీయూష్ జైన్ విషయానికి వస్తే… ఈయన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కు నమ్మిన బంటుగా చెప్పుకొంటారు. ఇటీవల… పీయూష్ జైన్ సంస్థ తయారు చేసిన “సమాజ్ వాదీ అత్తరు” (‘Samajwadi’ Perfume)కు ఉత్తరప్రదేశ్ లో ప్రచారకర్తగా సమాజ్ వాదీ పార్టీ వ్యవహరించింది. కాగా ట్రాన్స్పోర్ట్ సహా ఇతర వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉన్న పీయూష్ జైన్, అనేక తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి.. పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. రూ.50 వేలు అంతకన్నా తక్కువగా ఇన్వాయిస్ మొత్తాన్ని చూపెట్టి టాక్స్ ఎగ్గొట్టినట్లు పేర్కొన్న అధికారులు, అలంటి 200పైగా దొంగ ఇన్వాయిస్ కాపీలను పీయూష్ జైన్ సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈదాడులపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర… ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, సమాజ్ వాదీ పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. ఇదంతా ప్రజల డబ్బుగా పేర్కొన్న సంబిత్ పాత్ర… సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యక్తులను మరింత ప్రోత్సహిస్తుందని విమర్శించారు.

చదవండి : Subramanian swamy : స్వామి సంచలన ట్వీట్.. యూపీలో రాష్ట్రపతి పాలన?