Income Tax : సోనూ ఇంటికి మరోసారి ఐటీ అధికారులు

ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూసూద్ చేసుకున్న ఒప్పందంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

10TV Telugu News

Sonu Sood Home : బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ నివాసంపై ఐటీ శాఖ దాడులు చేయడం సర్వత్రా చర్చనీయాంశమమైంది. పన్ను ఎగవేత కేసు దర్యాప్తులో భాగంగా..లఖ్ నవూ నగరంలో ఉన్న సోనూకు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. దాదాపు 20 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. 2021, సెప్టెంబర్ 16వ తేదీ గురువారం ఉదయం మరోసారి ఐటీ అధికారులు సోనూ నివాసానికి చేరుకున్నారు.

Read More : SonuSood Chappal Discount : సోనూసూద్ పేరు చెబితే చెప్పులకు డిస్కౌంట్

లఖ్ నవూకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూసూద్ చేసుకున్న ఒప్పందంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. స్థిరాస్తి సంస్థతో చేసుకున్న ఒప్పందంలో పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు వెల్లడిస్తున్నారు. కరోనా కాలంలో సోనూ సూద్ చేసిన సహాయాలు అంతా ఇంతా కాదు. ఆదుకోవాలని చెప్పడమే తరువాయి..నేనున్నా అంటూ..వారికి చేతనైంత సహాయం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన సేవలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన అంత డబ్బు ఎక్కడిది ? అనే ప్రశ్నలు వినిపించాయి.

Read More : Sonu Sood : చిన్నారికి ‘రియల్ హీరో’ సోనూ సూద్ పేరు.. ఎందుకో తెలుసా..!

ఈ క్రమంలో…ఆఫ్ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి సోనూ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్ ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోనూ నివాసం, కార్యాలయాలపై జరుగుతున్న తనిఖీలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మందికి సాయం చేసిన సోనూపై ఐటీ దాడులు జరగడం కుట్రేనంటున్నాయి ప్రతిపక్షాలు. మరి ఐటీ దాడులపై సోనూ ఎలా స్పందిస్తారో చూడాలి.