Sonu Sood : చిన్నారికి ‘రియల్ హీరో’ సోనూ సూద్ పేరు.. ఎందుకో తెలుసా..!

రాజస్థాన్‌కు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చెయ్యాల్సి రావడంతో.. నిరుపేదలైన ఆ చిన్నారి తల్లిదండ్రులు సోనూ సూద్‌ను సాయం కోరారు..

Sonu Sood : చిన్నారికి ‘రియల్ హీరో’ సోనూ సూద్ పేరు.. ఎందుకో తెలుసా..!

Sonu Sood

Sonu Sood: సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూ సూద్‌.. గతేడాది లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటినుండి ‘రియల్ హీరో’ గా మారారు. దేశంలో ఏ మూల నుంచి అడిగినా వెంటనే సాయం చేస్తున్నారు. తాము కష్టాల్లో ఉన్నామని ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. క్షణాల్లోనే స్పందించి.. వారికి అవసరమైన సాయం చేస్తున్నారు ‘హెల్పింగ్ హ్యాండ్’ సోనూ సూద్.

Sonu Sood : ‘దేశం మెచ్చిన మొనగాడు’.. సోనూ సూద్‌తో 10 టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

సామాన్య ప్రజలే కాదు.. అన్నీ ఉన్న సెలబ్రిటీలకు కూడా ఇప్పుడు సోనూ సూద్ సహాయం అవసరమైంది. ఆయను నుండి సాయం పొందిన వారు అభిమానులుగా మారిపోతున్నారు. గుడికట్టి పూజిస్తున్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది.

Sonu Sood : ట్విట్టర్‌లో ‘రియల్ హీరో’ సెన్సేషన్..

ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చెయ్యాల్సి రావడంతో.. నిరుపేదలైన ఆ చిన్నారి తల్లిదండ్రులు సోనూ సూద్‌ను సాయం కోరారు. వెంటనే స్పందించి పాప సర్జరీకి అవసరమైన ఏర్పాట్లు చేయించారాయన. అప్పుడే తమ చిన్నారి ప్రాణాలు కాపాడిన సోనూ సూద్ మీద అభిమానంతో ఆ పాపకి సోను అని నామకరణం చేశారు. తాజాగా పాప డిశ్చార్జి అయ్యి క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.