Jackpot : అబుదబి లో కేరళ యువకుడికి జాక్ పాట్…. లాటరీలో 30కోట్లు

లాటరీ నిర్వాహకులు టిక్కెట్ పై ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే సునీల్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కేరళలో ఉన్న తన భార్యది కావటంతో నిర్వాహకులు సునీల్ కు సమాచారం అందించలేకపోయారు.

Jackpot : అబుదబి లో కేరళ యువకుడికి జాక్ పాట్…. లాటరీలో 30కోట్లు

Lottory (1)

Jackpot : ఈమధ్య కాలంలో  అరబ్ దేశాల్లో ఉంటున్న భారతీయులను అదృష్ణదేవత వరిస్తోంది. అక్కడ లాటరీ జాకపాట్ లన్నీ మన దేశానికి చెందిన వారే గెలుచుకుంటున్నారు. తాజాగా అబుదబిలోని ఖతార్ లో ఉండే కేరళకు చెందిన సనూప్ సునీల్ కు అతిపెద్ద జాక్ పాట్ తగిలింది. అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్ లో సునీల్ ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ అనగా 30.31కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు.

సనూప్ సునీల్ ఖతార్ లోని లూలూ గ్రూపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులైన భారతదేశానికే చెందిన 19మంది తో కలసి తలా కొద్ది మొత్తం డబ్బులు వేసుకుని జులై 13వ తేదిన ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. లాటరీకి సంబంధించి విజేతల ఎంపిక కార్యక్రమాన్ని లాటరీ నిర్వహాకులు నిర్వహించారు.

విజేతల ఎంపిక కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ప్రసారం చేశారు. తనకు లాటరీ తగులుతుందేమోనన్న ఆతృతతో చాలా చేపు లైవ్ కార్యక్రమాన్ని వీక్షించాడు. తొలుత రెండవ బహుమతి విజేతను ఎంపిక చేసిన నిర్వాహకులు, తరువాత మొదటి బహుమతి విజేత ను ప్రకటించారు. తనకు రాదన్న నిరాశతో రెండవ బహుమతి విజేత ఎంపిక సమయంలోనే లైవ్ చూడకుండానే బయటకు వెళ్ళిపోయాడు సునీల్.

లాటరీ నిర్వాహకులు టిక్కెట్ పై ఇచ్చిన ఫోన్ నెంబర్ కు కాల్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే సునీల్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కేరళలో ఉన్న తన భార్యది కావటంతో నిర్వాహకులు సునీల్ కు సమాచారం అందించలేకపోయారు. అయితే లైవ్ కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించిన స్నేహితులు సునీల్ కు ఫోన్ చేసి లాటరీలో మొదటి బహుమతి కైవసం చెసుకున్నట్లు తెలియజేశారు.

స్నేహితులు అందించిన సమాచారం తొలుత నమ్మని సునీలు లాటరీ నిర్వాహకులకు ఫోన్ చేసి నిర్ధారించుకున్నాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గతంలో కూడా ఇదే తరహాలో స్నేహితులు పలు పర్యాయాలు తల కొద్ది మొత్తంలో డబ్బులు వేసి లాటరీ టిక్కట్లు కొనుగోలు చేసేవారు. అయితే ఎన్నడూ వారు లాటరీ గెలవలేదు.

సునీల్ గత ఏడు సంవత్సరాలుగా ఖతార్ లోని లులూ గ్రూపులో పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బును తన 19స్నేహితులకు సమానంగా పంచి ఇవ్వనున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలవటంతో సంబరపడిపోతున్న సునీల్ తనకు తన బాస్ లూలూ గ్రూప్ వ్యవస్ధాపకులు యూసఫ్ అలీ ఆశ్శీస్సులు ఏప్పుడూ ఉంటాయంటున్నాడు.