Jamsetji Tata: ఈ శతాబ్దపు డొనేషన్లలో మన జమ్‌షడ్జీ టాప్!

ప్రపంచం మొత్తం మీద ఈ శతాబ్దపు అత్యధిక విరాళాలలో మరోసారి మన జమ్‌షడ్జీ టాప్ నిలిచారు. ప్రపంచంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎన్నోరకాలుగా రెండు చేతులా దానాలు చేసినప్పటికీ మన టాటా మాత్రం తనదే పైచేయి అనిపించుకున్నారు. భారత పారిశ్రామిక రంగానికే పితామహుడైన జమ్‌షడ్జీ టాటా విరాళాలలో కూడా గ్రేట్ అనిపించుకున్నారు.

Jamsetji Tata: ఈ శతాబ్దపు డొనేషన్లలో మన జమ్‌షడ్జీ టాప్!

Jamsetji Tata

Jamsetji Tata: ప్రపంచం మొత్తం మీద ఈ శతాబ్దపు అత్యధిక విరాళాలలో మరోసారి మన జమ్‌షడ్జీ టాప్ నిలిచారు. ప్రపంచంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎన్నోరకాలుగా రెండు చేతులా దానాలు చేసినప్పటికీ మన టాటా మాత్రం తనదే పైచేయి అనిపించుకున్నారు. భారత పారిశ్రామిక రంగానికే పితామహుడైన జమ్‌షడ్జీ టాటా విరాళాలలో కూడా గ్రేట్ అనిపించుకున్నారు. గత శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వశీలి జెమ్‌షెడ్జీ టాటాయేనని ఒక నివేదిక వెల్లడించింది. జెమ్‌షెడ్జీ ఈ శతాబ్దంలో మొత్తం 102 బిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు ఆ నివేదిక తెలిపింది.

హూరన్‌, ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌లు ప్రపంచంలోనే విరాళాలు అందించే టాప్ 50 మంది జాబితా ప్రకటించింది. కాగా అందులో టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడైన జెమ్‌షెడ్జీ ఇప్పటి మారకపు విలువ ప్రకారం రూ.7.65 లక్షల కోట్లను వితరణ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత బిల్‌ గేట్స్‌ 74.6 బిలియన్‌ డాలర్ల విరాళంతో రెండో స్థానాన్ని దక్కించుకోగా.. వారెన్‌ బఫెట్‌ (37.4 బి. డాలర్లు), జార్జ్‌ సోరోస్‌(34.8 బి. డాలర్లు), జాన్‌ డి రాక్‌ఫెల్లర్‌(26.8 బి. డాలర్లు)లు తరవాతి స్థానాల్లో ఉన్నారు.

అమెరికా, ఐరోపా దేశాలలోని కొందరు గత శతాబ్దకాలంగా భారీ విరాళాలను ప్రకటించడంలో ముందున్నప్పటికీ.. ప్రపంచంలోనే ఎక్కువమొత్తం దానం చేసిన వారిగా టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్జీ టాటా అవతరించారని హూరన్‌ ఛైర్మన్‌, చీఫ్‌ రీసెర్చర్‌ రూపర్ట్‌ హూగ్‌వెర్ఫ్‌ పేర్కొన్నారు. తన సంపదలో మూడింట రెండొంతుల వాటాను ట్రస్టులకు కేటాయించడం ద్వారా విద్య, ఆరోగ్యం వంటి పలు రంగాల సంక్షేమానికి టాటాలు పాటు పడినట్లు గుర్తుచేశారు. 1892 నుంచే జెమ్‌షెడ్జీ టాటా విరాళాలు మొదలైనట్లు తెలపగా ఇప్పటికీ రతన్ టాటా అదే హవా కొనసాగిస్తూనే ఉన్నారు.