Janhvi Kapoor : ఓర్హాన్‌‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్..

జాన్వీ, ఓర్హాన్‌లు కలిసి బాలీవుడ్ లో పలు పార్టీలకి హాజరవడం, ఇద్దరూ కలిసి విదేశాలకి ట్రిప్స్ వేయడం, రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అనుకుంటున్నారు................

Janhvi Kapoor : ఓర్హాన్‌‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్..

Janhvi Kapoor comments on dating news

Janhvi Kapoor :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్, స్టార్ కిడ్స్ ఎప్పుడూ పార్టీల్లో మునిగి తేలుతుంటారు. వారి పారీల్లో కొత్త కొత్త ఫేస్ లు చాలా కనిపిస్తాయి. చాలా మందితో చాలా క్లోజ్ గా ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక కొంతమందిపై ఫ్రెండ్షిప్, డేటింగ్ అని వార్తలు కూడా వస్తాయి. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ ఓర్హాన్‌ అవత్రమని అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది అని, ఎక్కువగా వీరిద్దరూ కలిసి పార్టీల్లో కనిపిస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

జాన్వీ, ఓర్హాన్‌లు కలిసి బాలీవుడ్ లో పలు పార్టీలకి హాజరవడం, ఇద్దరూ కలిసి విదేశాలకి ట్రిప్స్ వేయడం, రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అనుకుంటున్నారు. ఓర్హాన్‌ సారా అలీఖాన్ కి కూడా బెస్ట్ ఫ్రెండ్. సారా, జాన్వీ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో అప్పుడప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి కనపడతారు. కాని ఓర్హాన్‌ ఫ్రెండ్ సారా కంటే కూడా జాన్వీతోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తాజాగా మిలీ సినిమా ప్రమోషన్స్ లో జాన్వీ ఓర్హాన్‌ తో డేటింగ్ వార్తలపై స్పందించింది.

Adipurush : అనుకున్నదే అయిందిగా.. వాయిదాపడిన ఆదిపురుష్.. ఏకంగా జూన్‌కి..

జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఓర్హాన్‌ నాకు చాలా కాలంగా తెలుసు. అతను నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. నాకు అన్ని విషయాల్లోనూ మద్దతు ఇస్తాడు ఓర్హాన్‌. నేను అతనిని చాలా నమ్ముతాను” అని తెలిపింది.