Adipurush : అనుకున్నదే అయిందిగా.. వాయిదాపడిన ఆదిపురుష్.. ఏకంగా జూన్‌కి..

సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్న సినిమా కచ్చితంగా వాయిదాపడుతుందని భావించారు. గత కొన్నిరోజులుగా ఆదిపురుష్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా మీద వచ్చిన ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకొని..............

Adipurush : అనుకున్నదే అయిందిగా.. వాయిదాపడిన ఆదిపురుష్.. ఏకంగా జూన్‌కి..

Prabhas Adipurush Movie postponed officially

Adipurush :  ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు ప్రేక్షకులు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

టీజర్ చూసిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శించారు. ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేశారు ప్రేక్షకులు.

సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్న సినిమా కచ్చితంగా వాయిదాపడుతుందని భావించారు. గత కొన్నిరోజులుగా ఆదిపురుష్ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా మీద వచ్చిన ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకొని గ్రాఫిక్స్, విజువల్స్ లో మరింత మార్పులు చేయాలని చిత్ర యూనిట్ భావించింది. దీంతో చాలా టైం కావాలి. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్న అభిమానులకి ఏం చెప్పాలో తెలియక, మరోపక్క సినిమాని విమర్శించేవాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక చిత్ర యూనిట్ సినిమాని అధికారికంగా వాయిదా వేశారు.

Geetha Singh : ఆ హీరోయిన్లు నన్ను అవమానిస్తే.. అల్లరి నరేష్ నన్ను తీసుకెళ్లి మరీ వాళ్ళకి గొప్పగా చెప్పాడు..

తాజాగా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఓం రౌత్ తన సోషల్ మీడియాలో.. ”ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన సంసృతి, శ్రీరాముడికి చెందిన ఒక భక్తి, చరిత్ర. ఇందుకోసం ప్రేక్షకులకి మరింత మంచిగా ఈ సినిమాని చూపించడానికి మేము మరింత కష్టపడుతున్నాము. అందుకే సినిమాని వాయిదా వేస్తున్నాము. ఆదిపురుష్ సినిమా జూన్ 16, 2023లో రిలీజ్ అవుతుంది. మేము తీసే ఈ సినిమా చూసి ఇండియా గర్విస్తుంది. మీ సపోర్ట్ మాకు కావాలి” అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందగా, సినిమాపై ఇప్పటికే నెగిటివిటి ఉండగా మరింత నెగిటివిటీ వస్తుంది.