Rohit Sharma: బుమ్రాది గొప్ప క్రికెట్ మైండ్ – రోహిత్ శర్మ

: శ్రీలంకతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ లకు ముందు టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.

Rohit Sharma: బుమ్రాది గొప్ప క్రికెట్ మైండ్ – రోహిత్ శర్మ

Rohit Sharma

Rohit Sharma: శ్రీలంకతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ లకు ముందు టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. ఈ నిర్ణయం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన వన్డే సిరీస్ లో తొలిసారి బుమ్రాను వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. కేఎల్ రాహుల్ గైర్హాజరీతో బుమ్రాను డిప్యూటీ చేశారు.

గత నెలలో వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ వహించాడు.

రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ప్రకటిస్తూనే రాహుల్, పంత్, బుమ్రాలను భవిష్యత్ లీడర్లుగా తయారుచేయాలని సెలక్షన్ కమిటీ ప్లాన్ చేస్తుంది.

Read Also: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ ఎవరంటే? టెస్ట్ జట్టు ఇదే!

బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్ మూడు ఫార్మాట్లలో దూసుకెళ్తుండగా.. ఈ వైస్ కెప్టెన్సీ హోదా అతనిలోని సత్తాను బూస్ట్ చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ.

‘బౌలర్, బ్యాటర్ అనేది విషయం కాదు. క్రికెటింగ్ బ్రెయిన్ ఉండటం ముఖ్యం. అతను నాకు బాగా తెలుసు. క్రికెట్ పట్ల ఆలోచనాతీరు కూడా నాకు తెలుసు. లీడర్‌షిప్ రోల్‌లో అడుగుపెట్టడం అతనికి చాలా మంచిది. గేమ్ ను తర్వాతి లెవల్‌కు తీసుకెళ్లగలడు. అతను చేసే పనికి ఈ రోల్ మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుందని నమ్ముతున్నా. టీంలో వైస్ కెప్టెన్ గా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని రోహిత్ శర్మ శ్రీలంకతో తొలి టీ20కు ముందు వెల్లడించాడు.