MAA Elections: గెలిచిన.. గెలవకపోయినా..’మా’ క్యాంటీన్ పెడతా -జీవిత రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రసవత్తరంగా సాగిన 'మా' ఎన్నికల ప్రచారం ఎట్టకేలకు పూర్తయ్యింది.

MAA Elections: గెలిచిన.. గెలవకపోయినా..’మా’ క్యాంటీన్ పెడతా -జీవిత రాజశేఖర్

Jeevitha

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రసవత్తరంగా సాగిన ‘మా’ ఎన్నికల ప్రచారం ఎట్టకేలకు పూర్తయ్యింది. ఎన్నికల్లో ఓట్ల కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేశాయి. ‘మా’ ప్రసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయగా.. ఇరువైపుల ఆర్టిస్టులు గట్టిగానే తిట్టుకున్నారు.

10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన జీవిత రాజశేఖర్.. మా ఎన్నికలకు పూర్తి సన్నదంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల లాస్ట్ మినిట్ వరకు ‘మా’లో డైలాగ్ వార్ సహజంగానే ఉంటుందని ఆమె అన్నారు. రేపు పోలింగ్ వరకు మా ప్రచారం చేసుకుంటామని ప్రకటించారు.

మ్యానిఫెస్టో ప్రకటించపోవడం తప్పేమికాదని, మ్యానిఫెస్టోలో చెప్పినవి చేయకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. మా మ్యానిఫెస్టో ఎజెండాను సభ్యులకు చెబుతూనే ఉన్నామని, మ్యానిఫెస్టోని విడుదల చేస్తే కామెడీ అవుతుందని, అందుకే మ్యానిఫెస్టో ప్రకటించలేదని అన్నారు. మంచు మ్యానిఫెస్టో బాగానే ఉందని, మా కోసం ఫండ్ రైజ్ ఎలా అన్నది క్లారిటీగా లేదన్నారు.

మేం గెలిచిన.. గెలవకపోయినా.. ‘మా’ క్యాంటిన్ పెడతామని చెప్పారు జీవిత. రాజశేఖర్ ట్రస్ట్ ద్వారా సహకారం తీసుకుని, ‘మా’ ఆఫీస్ పరిధిలో 24 క్రాఫ్ట్స్ కోసం ‘మా’ క్యాంటిన్ పెడుతామని అన్నారు. అమ్మా క్యాంటిన్ ,అన్న క్యాంటిన్ మాదిరిగా మా క్యాంటిన్ ఉంటుందని అన్నారు. రాజశేఖర్ మోహన్ బాబుని కలవడాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు.

నరేష్ ఈ విషయాన్ని పెద్ద సీన్ చేస్తున్నారని, ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే బాగుంటుంది కదా? అని మోహన్ బాబుతో రాజశేఖర్ మాట్లాడారని, మోహన్ బాబు వెనక నరేష్ గోతులు తీస్తున్నారని అన్నారు. అది మంచి ఫ్యామిలీకే నష్టమని అభిప్రాయపడ్డారు. గెలుపుపై నేను జ్యోతిష్యం చెప్పను. సభ్యులు ఎవరు రైట్ అనుకుంటే వారిని గెలిపిస్తారు. ఈసారీ ఎనభై శాతం మా సభ్యులు ఆలోచిస్తున్నారని అన్నారు.