Jio Cinema : జియో వూట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవేనా.. 2 రూపాయలకే సినిమాలు చూడొచ్చు..

జియో వూట్ కలిసిన తర్వాత ప్రేక్షకులకు సినిమాలు, సిరీస్ లు అన్ని భాషల్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. తాజాగా వీటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ వైరల్ అవుతున్నాయి.

Jio Cinema : జియో వూట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవేనా.. 2 రూపాయలకే సినిమాలు చూడొచ్చు..

Jio Cinemas OTT new subscription plans

Jio Cinema :  జియో సినిమాస్ IPL ఫ్రీ టెలికాస్ట్ ఇస్తుండటంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. మరో నాలుగేళ్లపాటు కూడా జియో(Jio) సినిమా IPL ను ఫ్రీగానే టెలికాస్ట్ చేస్తుంది. దీంతో జియో సినిమాకు వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, మంచి ఓటీటీగా(OTT) మార్చాలని జియో మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జియో స్టూడియోస్(Jio Studios) తరపున జియో సినిమా యాప్ కోసం దేశవ్యాప్తంగా దాదాపు 100 సినిమాలు, సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ సినిమాలు, సిరీస్ లు త్వరలోనే జియో సినిమాస్ యాప్ లో రానున్నాయి. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాక రానున్నాయి. దీన్ని పూర్తి స్థాయి ఓటీటీగా మార్చి ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అంతే కాకుండా మరో ఓటీటీ వూట్ ని కూడా జియోలో కలిపేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో IPL ని మాత్రం ఫ్రీగా టెలికాస్ట్ చేసి సినిమాలకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ పెడతారని ఇటీవల ప్రకటించారు.

జియో వూట్ కలిసిన తర్వాత ప్రేక్షకులకు సినిమాలు, సిరీస్ లు అన్ని భాషల్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. తాజాగా వీటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్క రోజుకి 2 రూపాయలు మాత్రమే తీసుకొని జియో సినిమాస్ రోజువారీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వనుందని సమాచారం. 2 రూపాయలతో 2 డివైజ్ లకు కూడా ఇవ్వనున్నారు. అలాగే 99 రూపాయలకు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తో 2 డివైజ్ లలో వాడుకునేలా ఇవ్వనున్నారు. 599 రూపాయలతో సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను 4 డివైజ్ లలో వాడుకునేలా జియో సినిమాస్ ఇవ్వనుందని సమాచారం.

PKSDT Movie : పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

అధికారికంగా జియో వూట్ కలిసి వాటి కంటెంట్ ను మే మూడవ వారం నుంచి ప్రేక్షకులకు అందిస్తారని సమాచారం. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా అప్పట్నుంచే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. దీనిపై జియో సినిమాస్ అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. మొత్తానికి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాగే జియో సినిమా కూడా అతిపెద్ద ఓటీటీగా అవతరించాలని చూస్తోంది.