JioFiber Broadband Plan Offers : జియోఫైబర్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ బెస్ట్ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్..!

JioFiber Offers broadband plans : జియోఫైబర్ తమ వినియోగదారుల కోసం జియో ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ నుంచి వార్షిక వ్యాలిడిటితో నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు.

JioFiber Broadband Plan Offers : జియోఫైబర్ యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ బెస్ట్ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్..!

JioFiber offers 90 days broadband plan under Rs 1200

JioFiber Offers 90 days broadband plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ కోసం చూసే వినియోగదారులకు ఇదే సరైన అవకాశం. జియో కస్టమర్లందరికీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లు నెలకు రూ. 399 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఏడాదికి రూ. 1 లక్షకు పైగా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తాయి. జియోఫైబర్ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసికం లేదా వార్షిక కనెక్షన్‌ని ఎంచుకోవచ్చు. జియోఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సంబంధించి జాబితాలో త్రైమాసిక ప్లాన్‌లను ఓసారి ట్రై చేయండి. రూ. 1197 ధరతో, కేవలం ఇంటర్నెట్, కాలింగ్ బెనిఫిట్స్ కోరుకునే జియోఫైబర్ యూజర్లకు బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. జియో రూ. 1197 ప్లాన్‌ సహా ఇతర ప్లాన్లలో ఏయే బెనిఫిట్స్ ఉన్నాయో ఓసారి చూద్దాం..

రూ. 1197 ప్లాన్ :
ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్‌తో పాటు అప్‌లోడ్, డౌన్‌లోడ్ రెండింటికీ 90-రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. 30 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. ముఖ్యంగా, అన్‌లిమిటెడ్ డేటా పరిధి అంటే ప్రతి నెలా 3.3 TB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. చాలా మంది యూజర్లకు సరిపోతుంది. అంటే.. నెలకు రూ. 399 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ప్లాన్లను ఇష్టపడని యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. అయితే, ఈ నెలవారీ ప్లాన్ జీఎస్టీ లేకుండా ధర రూ. 1197కు అందుబాటులో ఉంది.

Read Also : Simple One Electric Scooter : రూ. 1.45 లక్షలకే సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ దూసుకెళ్తుంది..!

OTT బెనిఫిట్స్‌తో జియోఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
జియోఫైబర్ ప్లాన్లపై ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. అందులో ఇంటర్నెట్, కాలింగ్ బెనిఫిట్స్ మాత్రమే అందిస్తుంది. OTT బెనిఫిట్స్ కోరుకునే జియోఫైబర్ కస్టమర్‌లు ఇతర త్రైమాసిక ప్లాన్‌లను ట్రై చేయొచ్చు. ఫ్రీ OTT సభ్యత్వాలతో పాటు మరిన్ని అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్‌ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. త్రైమాసిక వ్యాలిడిటీ (90 రోజులు), OTT బెనిఫిట్స్ కొన్ని జియోఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.

JioFiber offers 90 days broadband plan under Rs 1200

JioFiber offers 90 days broadband plan under Rs 1200

జియోఫైబర్ రూ. 2997 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ 150 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా, మరిన్నింటితో సహా 16 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల OTT బెనిఫిట్స్ కూడా యూజర్లకు అందిస్తుంది.

జియోఫైబర్ రూ. 4497 ​​ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ 300 Mbps స్పీడ్ అందిస్తుంది. Netflix, Prime Video, Disney+ Hotstar, JioCinema మరిన్నింటితో సహా 17 యాప్‌ల OTT బండిల్‌తో వస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ కోరుకునే యూజర్లు రూ. 7497, రూ. 11997, రూ. 25497 ప్లాన్‌లను కూడా చెక్ చేయవచ్చు. ఈ ప్లాన్లపై వరుసగా 500 Mbps, 1 Gbps హైస్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తాయి. ఈ ప్లాన్‌లు OTT బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. ప్రతిరోజూ ఎక్కువ డేటాను వినియోగించే యూజర్లకు ఈ ప్లాన్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Google Bard AI Chatbot : గూగుల్ బార్డ్ ఏఐ ఇమేజ్ సెర్చ్‌లో ఫొటోను చూపిస్తే.. పూర్తి వివరాలను పసిగట్టేస్తుంది.. ఎలా వాడాలో తెలుసా?