Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఆమె ఏప్రిల్ 19న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు.....

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటో తెలుసా?

Kajal Aggarwal's Son Name Also Revealed

Updated On : April 20, 2022 / 1:50 PM IST

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఆమె ఏప్రిల్ 19న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో మరోసారి కాజల్ పేరు హాట్ టాపిక్‌గా మారిపోయింది. గౌతమ్ కిచ్లు, కాజల్ అగర్వాల్ దంపతులు మగబిడ్డకు జన్మనివ్వడంతో వారికి పలువురు ప్రముఖులతో పాటు ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ కొడుకు పేరును కూడా రివీల్ చేశారు ఆమె సోదరి, నటి నిషా అగర్వాల్.

Kajal Aggarwal: మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్

తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి అడుగుపెట్టాడని.. అందరం కలిసి అతడికి నీల్ కిచ్లు అనే పేరును పెట్టామని.. నీల్ కిచ్లుకి తమ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని నిషా అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇది చూసిన కాజల్ అభిమానులు, అప్పుడే తన కొడుకుకి పేరు కూడా పెట్టడంపై కాజల్‌ను అభినందిస్తున్నారు. ఇక కాజల్, ఆమె కొడుకు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kajal Aggarwal : ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు

అటు సినిమాల విషయానికి వస్తే.. కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఈ నెల 29న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమాలో కాజల్ పాత్ర నిడివిని తగ్గించినట్లుగా గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Kajal Aggarwal's Son Name