Kamal Hasan: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!

క‌మ‌ల్ హాస‌న్‌.. నటనలో ఇదొక బ్రాండ్. అందుకే ఇండియ‌న్ సినిమాల్లో ఈ పేరు తెలియ‌ని వ్య‌క్తి ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన వ్య‌క్తి. నటనలో ఆయన చేయాల్సింది..

Kamal Hasan: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!

Kamal Hasan

Updated On : November 15, 2021 / 7:45 PM IST

Kamal Hasan: క‌మ‌ల్ హాస‌న్‌.. నటనలో ఇదొక బ్రాండ్. అందుకే ఇండియ‌న్ సినిమాల్లో ఈ పేరు తెలియ‌ని వ్య‌క్తి ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన వ్య‌క్తి. నటనలో ఆయన చేయాల్సింది ఇంకేం లేదేమో. ఎన్నో ప్రయోగాలు అంతకు మించిన పాత్రలతో ఆయన సినీ వినీలాకాశంలో చెరగని ముద్ర వేశారు. ఒక్క నటుడిగానే కాదు సినిమాలోని అన్ని విభాగాల‌పై మంచి ప‌ట్టున్న వ్య‌క్తి. నటుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, టెక్నీషియ‌న్‌గా ఇలా అన్నింటా తానై క‌నిపించే ప్ర‌య‌త్నం చేశాడు.

Ram Charan: జెర్సీ దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా.. చెర్రీ కల తీరేవేళ!

ఇప్పటికే దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన కమల్ నిర్మాతగా కూడా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ స్థాపించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లోనే కమల్ తాజా సినిమా ‘విక్రమ్’ కూడా తెరకెక్కింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, నరేన్ కీలకమైన పాత్రలలో నటించారు. ఇప్పటికీ విడుదలైన ఈ సినిమా టీజర్ కమల్ సినిమా అంటే ఏంటో మరోసారి రుజువుచేసింది.

Pooja Hegde: మాల్దీవుల్లో అందాల మంట పెట్టిన పూజా హెగ్డే.. బాప్ రే బికినీ షో..!

కాగా, కమల్ ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసిన కమల్ ఈ మల్టీస్టారర్ కోసం తమిళ స్టార్ హీరోలు విక్రమ్, విజయ్ సేతుపతిలను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తి కాగా విక్రమ్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కించనున్నారట. అయితే.. ఇందులో కేవలం విజయ్ సేతుపతి, విక్రమ్ లు మాత్రమే ఉంటారా.. లేక కమల్ కూడా నటిస్తాడా.. దర్శకత్వ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా మాత్రమే కమల్ ఉంటాడా అన్నది తెలియాల్సి ఉంది.