కన్నడ నాట యంగ్ తరంగ్.. హీరో అవతార్..

కన్నడ నాట యంగ్ తరంగ్.. హీరో అవతార్..

Kannada Hero Avatar: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అందులో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదుగుతున్న తారలు చాలా మంది ఉన్నారు. అటువంటి కోవకు చెందిన హీరోనే అవతార్. కర్ణాటకలోని మంగళూరు దగ్గర పుత్తూరు విలేజ్‌లో పుట్టి పెరిగిన అవతార్.. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. పుత్తూర్‌లో గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసి.. 2013 లో మైసూర్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేశాడు.. ఆ తరువాత అవకాశాల కోసం.. ఆల్బమ్ పట్టుకుని ఏడాది పాటు తిరిగిన అవతార్.. సినిమా మీద ఉన్న ప్రేమ వల్ల పట్టుదలతో ప్రయత్నాలు చేశారు. హీరోగా తనను తాను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి అన్న తపనతో ఒక్క ఛాన్స్ కోసం ఓపిగ్గా వెయిట్ చేశారు.

Avatar

హీరోగా నిలబడాలంటే.. ముందు ఇండస్ట్రీలోకి ఏదో ఒక రకంగా ఎంటర్ అవ్వాలి.. అది కూడా తనకు నప్పే పాత్రలు చేయాలి అనుకుని తనకు వచ్చిన విలన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అవతార్. మంగళూర్‌లో ఉన్న తన మాతృ భాష తుళులో.. కోస్టల్ ఉడ్ ఇండస్ట్రీలో నెగెటివ్ రోల్స్‌తో స్టార్ట్ అయ్యింది అవతార్ ఫిల్మ్ కెరీర్.. ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకోకుండా నటుడిగా బిజీ అయ్యారు..

ఫస్ట్ మూవీకే విలన్‌గా అవార్డ్ రావడంతో.. ఆయనకు ‘పవిత్రా’ అనే మరో సినిమాలో విలన్‌గా అవకాశం వచ్చింది.. తనను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ సూర్యం సలహా మేరకు నెగెటివ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు.. తన గురించి అవతార్ మాటల్లో.. ‘‘కష్టపడితే ఏదో ఒక రోజు తప్పకుండా లైఫ్ వస్తుంది అని సూర్యం గారు చెప్పడంతో.. నెగెటివ్ రోల్స్ చేయడం మొదలు పెట్టారు. 2017 లో ఓ కన్నడ మూవీలో అవకాశం వచ్చింది. ‘హ్యాపీ జర్నీ’ అనే సినిమాలో విలన్‌గా చేశాను. ఆ తరువాత తెలుగులో హిట్ అయిన ‘కుమారి 21 ఎఫ్’ మూవీని కన్నడలో శ్రీమాన్ వేముల డైరెక్షన్‌లో రీమేక్ చేశారు.. ఇందులో కూడా మంచి క్యారెక్టర్ ఉంది అని కాల్ రావడంతో.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.

Avatar

అప్పటికీ తెలుగు కొంచెం కొంచెం మాత్రమే వచ్చు.. ‘కారి’ సినిమా కన్నడ రీమేక్ టైమ్‌లో తెలుగు టెక్నీషియన్స్ ఎక్కువగా ఉండటంతో.. వాళ్లతో మాట్లాడుతూ.. తెలుగు ప్లూయెంట్‌గా నేర్చుకున్నాను. ఇక వెంటనే అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి.. కన్నడలో ‘పరసంగా’ అనే సినిమాలో సెకండ్ లీడ్‌ క్యారెక్టర్‌లో నటించన తరువాత తెలుగులో హీరోగా అవకాశం వచ్చింది. ‘ఎంతవారలైనా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సరిగ్గా ఆడలేదు..

మళ్ళీ కన్నడలో హీరోగా లాస్ట్ ఇయర్ ‘రివీల్’ అనే సినిమాలో నటించాను. దాంతో పూర్తి స్థాయి హీరోగా.. శాండల్‌వుడ్‌లో గుర్తింపు వచ్చింది. 2013 నుంచి ఇప్పటి వరకూ చాలా కష్టపడ్డాను.. అనుకున్న వాళ్ళు ఎవరూ నాకు సహాయం చేయలేదు. వర్కౌట్ అవుతందో లేదో అనుకున్న వారి నుంచి సహాయం అందింది. అన్ని కష్టాలు దాటుకుని వచ్చినందకు ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే హీరోగా మంచి గుర్తింపు వస్తోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. రెండు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించిన అప్‌డేట్స్ రిలీజ్ అవుతాయి. ఈ నా సినిమా జర్నీలో నేను నేర్చుకున్న నిజం ఏంటంటే.. కష్టపడుకుండా ఏదీ రాదు. కానీ ఒక మంచి సినిమా జనాల్లోకి వెళ్లిందంటే.. హీరోగా తిరుగులేని అభిమానాన్నీ సంపాదించుకోవచ్చు..

Gajanooru

ఇక కన్నడలో రీసెంట్‌గా ఓ పెద్ద సినిమా స్టార్ట్ అయ్యింది. ‘గాజనూర్’ టైటిల్‌తో మంచి కథతో.. రాబోతున్న ఈ సినిమాపై మంచి ఎక్స్‌‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాను కూడా మూడు, నాలుగు భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నాం.. ముందు కన్నడలోనే రిలీజ్ అవుతుంది. తెలుగులో స్టార్ రైటర్.. రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారితో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంటా. ఆయన కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ‘గాజనూర్’ తరువాత తెలుగులో మంచి బ్యానర్‌లో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక ప్రస్తుతం తెలుగులో ‘పరువం వానగా’ అనే సినిమా చేస్తున్నాను. నాగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.. షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.. దాని తర్వాత రిలీజ్‌పై దృష్టి పెడతాం. అటు కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి.. టాలీవుడ్‌లో కూడా సక్సెస్‌ఫుల్ హీరో అవ్వాలని కష్టపడుతున్నా’’.. అన్నారు..Avatar