Kantara : సర్ప్రైజ్.. ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కాంతార.. రెండు విభాగాల్లో పోటీకి..
సడెన్ గా ఆస్కార్ నామినేషన్స్ లో రెండు విభాగాల్లో నామినేషన్స్ సాధించి అందర్నీ సర్ప్రైజ్ చేసింది ఈ సినిమా. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (రిషబ్ శెట్టి) కేటగిరీలలో కాంతార సినిమా ఆస్కార్ నామినేషన్స్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా............
Kantara : ఏ సినిమాకి అయినా, సినిమా వాడికి అయినా ఆస్కార్ అవార్డు సాధించడం, కనీసం దాని క్వాలిఫికేషన్స్ లిస్ట్ లోకి వెళ్ళాలి అని అయినా కల ఉంటుంది. ఈ సంవత్సరం అధికారికంగా గుజరాతి సినిమా చల్లా షోని దేశం తరపున ఆస్కార్ కి పంపించారు. ఇక బయట నుంచి RRR సినిమా ఆస్కార్ లో నిలవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. దీంతో నాటు నాటు సాంగ్ కి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లో నిలిచింది.
ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ వేడుక మార్చ్ 12న జరగనుంది. తాజాగా ఇండియా నుంచి మరో సినిమా రెండు విభాగాల్లో క్వాలిఫికేషన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కన్నడలో చిన్న సినిమాగా రిలీజయిన కాంతార దేశమంతటా భారీ విజయం సాధించింది. 25 కోట్లతో తెరకెక్కించిన కాంతార సినిమా దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కేసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లో మొత్తం 301 సినిమాలు వెళ్లాయి. మరి వీటిలో ఓటింగ్ తర్వాత నామినేషన్స్ లో ఎన్ని నిలుస్తాయి చూడాలి.
అయితే వేరే దేశాల్లో కాంతారకి RRR కి వచ్చినంత పేరు రాలేదు. కాంతార సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి ట్రై చేసినట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు, ఎక్కడా అప్డేట్స్ లేవు. కానీ సడెన్ గా ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లో రెండు విభాగాల్లో నామినేషన్స్ సాధించి అందర్నీ సర్ప్రైజ్ చేసింది ఈ సినిమా. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (రిషబ్ శెట్టి) కేటగిరీలలో కాంతార సినిమా ఆస్కార్ క్వాలిఫికేషన్స్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అందరూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు.
We are overjoyed to share that ‘Kantara’ has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms
— Hombale Films (@hombalefilms) January 10, 2023