Monkey CC Cameras Theft : సీసీ కెమెరాలు ఎత్తుకుపోతున్న కోతి .. తలపట్టుకున్న ఇంటి యాజమాని

 కోతి పనులు అని ఊరికే అనరు. ఇటీవల కోతులు చేసే పనులు చూస్తుంటే అంతకుమించి అన్నట్లుగా ఉన్నాయి. వైన్ షాపు వద్ద కాపు కాచి మందుబాబుల చేతుల్లోంచి బీరు బాటిళ్లు ఎత్తుపోయిన కోతి గురించి విన్నాం..సెల్ ఫోన్లు ఎత్తుకుపోయి నానా రచ్చ చేసిన మర్కటాల గురించి విన్నాం. ఓ కోతి మాత్రం సీసీ టీవీ కెమెరాలపై కన్నేసింది. ఏ షాపుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎత్తుకుపోతోంది. అలా 13 సీసీ టీవీ కెమెరాలు ఎత్తుకుపోయింది.

Monkey CC Cameras Theft : సీసీ కెమెరాలు ఎత్తుకుపోతున్న కోతి .. తలపట్టుకున్న ఇంటి యాజమాని

Monkey CC Cameras Theft

Monkey CC Cameras Theft : కోతి పనులు అని ఊరికే అనరు. ఇటీవల కోతులు చేసే పనులు చూస్తుంటే అంతకుమించి అన్నట్లుగా ఉన్నాయి. వైన్ షాపు వద్ద కాపు కాచి మందుబాబుల చేతుల్లోంచి బీరు బాటిళ్లు ఎత్తుపోయిన కోతి గురించి విన్నాం..సెల్ ఫోన్లు ఎత్తుకుపోయి నానా రచ్చ చేసిన మర్కటాల గురించి విన్నాం. కన్యాకుమారిలో మాత్రం ఓ కోతి సీసీ టీవీీ కెమెరాలపై కన్నేసింది. ఓ షాపుకు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఎత్తుకుపోతోంది. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 13 సీసీ టీవీ కెమెరాలు ఎత్తుకుపోయింది.

క‌న్యాకుమారిలోని ఓ ప్లైవుడ్ కంపెనీ య‌జ‌మాని ప్లైవుడ్ షాపు ప‌రిస‌రాల్లో ఏం జ‌రుగుతుందో గుర్తించేందుకు య‌జ‌మాని త‌న షాపులో సీసీటీవీ కెమెరాల‌ను అమర్చాడు. ఈక్రమంలో సీసీ కెమెరాలు మాయం అవుతుండటంతో ఆశ్చర్యపోయాడు. చోరీ చేయటానికి ప్లాన్ వేసి ఎవరో దొంగలు ఈ పని చేసి ఉంటారని అని అనుమానించాడు. కానీ కెమెరాలు పోతున్నాయి. కానీ ఫుటేజీ ఉండటంతో సీసీ కెమెరాలను ఎవరు ఎత్తుకుపోయారో చూద్దామని ఫుటేజీ పరిశించి షాక్ అయ్యాడు సదరు యజమాని.

ఓ కోతి సీసీటీవీ కెమెరాల‌ను దొంగిలించ‌డం ఫుటేజ్ లో కూడా కంగుతిన్నారు. చోరీల‌ను ప‌సిగ‌ట్టేందుకు తాను ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల‌ను ఒక‌దాని త‌ర్వాత ఒక కెమెరా చోరీకి గురిఅవుతుండ‌టంతో య‌జ‌మాని విస్తుపోయాడు. కెమెరాల‌ను చోరీ చేస్తున్న దొంగ‌ ఎవరో దొరుకుతారనుకుంటే ఆ దొంగ ఓ కోతే అని తెలిసి షాక్ అయ్యాడు. సదరు య‌జ‌మాని ఇప్ప‌టివ‌ర‌కూ 13 సీసీటీవీ కెమెరాల‌ను పోగొట్టుకున్నాడు. ఈ సీసీటీవీ కెమెరాల‌ను చోరీ చేసిన కోతి వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.