Operation Ganga : మా పాప పేరు ‘ఆపరేషన్ గంగ’

ఆపరేషన్ గంగ కార్యక్రమం ద్వారా సురక్షితంగా యుక్రెయిన్ నుంచి బయటపడిన గర్భిణి పుట్టబోయే బిడ్డకు గంగ పేరు పెట్టుకుంటామని తెలిపారు.

Operation Ganga : మా పాప పేరు ‘ఆపరేషన్ గంగ’

Baby Child Named Operation Ganga

baby girl’s name ‘Operation Ganga’ : రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా ఇండియా తీసుకురావటానికి భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ వల్ల ఎంతోమంది మాతృదేశానికి చేరుకుంటున్నారు. ఈ ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం సహాయంతో కేరళకు చెందిన ఓ కుటుంబం యుద్ధభూమి యుక్రెయిన్ నుంచి క్షేమంగా బయటకొచ్చింది. ఆ దంపతులు త్వరలోనే ఓ బేబీకి జన్మనివ్వబోతున్నారు. పుట్టే బిడ్డకు ‘గంగ’ పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ తండ్రి తెలిపారు.

Also read : Ukraine Russia Crisis : యుధ్ధం ఎఫెక్ట్-రష్యాకు ఫోన్లు,చిప్‌ల సరఫరా నిలిపివేసిన సామ్‌సంగ్

కేరళకు చెందిన అభిజిత్.. ఆయన భార్య..యుక్రెయిన్ రాజధాని కీవ్ లో చిక్కుకుపోయారు. భారత రాయబార కార్యాలయం సిబ్బంది సహాయంతో దంపతులిద్దరు ఎట్టకేలకు కీవ్ నుంచి సరిహద్దు దేశమైన పోలండ్ కు చేరుకున్నారు. పోలండ్ లో భారత ఎంబసీ ఏర్పాటు చేసిన షెల్టర్ కు వెళ్లారు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంటూ అభిజిత్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ..‘‘నా భార్య తొమ్మిది నెలల గర్భంతో ఉందని ప్రస్తుతం ఆమె పోలండ్ లోని ఓ ఆసుపత్రిలో చేరిందని తెలిపారు. తల్లి, గర్భంలోని శిశువు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారనే సమాచారం నాకు అందిందని ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. మార్చి 26న నా భార్యకు డెలివరీ డేట్. బిడ్డకు జన్మనివ్వనుంది. పుట్టే బిడ్డకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ సహాయక కార్యక్రమం పేరునే బేబీకి పెట్టుకోవాలని నిర్ణయించానని బిడ్డకు ‘గంగ‘ అని పేరు పెట్టుకుంటాం’ అని అభిజిత్ తెలిపాడు.

Also read : Russia Ukraine War : రష్యాతో మూడోసారి చర్చలకు యుక్రెయిన్‌ సిద్ధం.. ఈసారైనే ఫలిస్తాయా?

నేను ఇండియాకు వస్తున్నానని..నా భార్య పోలండ్ ఆస్పత్రిలోనే ఉంటుందని చెప్పాడు. కాగా..యుక్రెయిన్ రాజధాని కీవ్ లో అభిజిత్ ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. భారత ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు చాలా బాగున్నాయని..భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “నేను యుక్రెయిన్ (కీవ్) నుండి పోలాండ్ (ర్జెస్జో) వరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలిపారు.