Russia Ukraine War : రష్యాతో మూడోసారి చర్చలకు యుక్రెయిన్‌ సిద్ధం.. ఈసారైనే ఫలిస్తాయా?

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైన్యం దీటుగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాతో మూడోసారి చర్చలకు ప్లాన్ చేస్తోంది.

Russia Ukraine War : రష్యాతో మూడోసారి చర్చలకు యుక్రెయిన్‌ సిద్ధం.. ఈసారైనే ఫలిస్తాయా?

Russia Ukraine War Ukraine Seeks Meeting With Russia Third Time To Discuss On War

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలపై యుక్రెయిన్ సైనిక బలగాలు కూడా దీటుగానే ప్రతిఘటిస్తున్నాయి. ఇదే సమయంలో యుక్రెయిన్ రష్యాతో మూడోసారి చర్చలకు సన్నద్ధమవుతోంది. రష్యాతో యుద్ధం చేస్తూనే మరోవైపు శాంతిపరమైన చర్చలకు యుక్రెయిన్ పిలుపునిచ్చింది. ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ వారం చివరిలో రష్యా అధికారులతో మూడో రౌండ్ చర్చలకు యుక్రెయిన్ ప్లాన్ చేస్తోంది.

ఈ సమాచారాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ సలహాదారు వెల్లడించారు. ఇదివరకే రెండుసార్లు పోలిష్ సరిహద్దు సమీపంలో బెలారస్‌లో చర్చలు జరపగా.. ఫలితానివ్వలేదు. వివాదానికి రాజకీయ పరిష్కారానికి సంబంధించి ఇరుపక్షాల వైఖరి స్పష్టంగా ఉందన్నారు. పౌరుల తరలింపు కోసం సురక్షితమైన కారిడార్లను నిర్మించడానికి రష్యా – ఉక్రెయిన్ తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ధృవీకరించారు. తర్వాతి చర్చలు యుక్రెయిన్ పార్లమెంటులకు లోబడి ఒప్పందాలు కుదరవచ్చని రష్యా సీనియర్ పార్లమెంటేరియన్ లియోనిడ్ స్లట్‌స్కీ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు ముచ్చటగా మూడోసారైనా ఇరుదేశాల మధ్య చర్చలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Russia Ukraine War : యుద్ధానికి తాత్కాలిక బ్రేక్… ఎందుకంటే? :
మరోవైపు.. ప్రపంచ దేశాల ఒత్తిడితో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌లో కాల్పుల విరమిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. అది కూడా తాత్కాలిక విరామమేనని స్పష్టం చేసింది. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి కాల్పులను విరమిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. మానవతాధృక్పథంతో కాల్పుల విరమణిస్తున్నట్టు రష్యా వెల్లడించింది. ఐదున్నర గంటల పాటు యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించింది. యుద్ధక్షేత్రంలో సామాన్యులు దేశం దాటేందుకు వీలుగా కాల్పులను విరమణకు అంగీకరించినట్టు తెలిపింది. యుద్ధాన్ని ప్రారంభించిన 10వ రోజు కాల్పుల విరమణను ప్రకటించింది. యుద్ధంలో సామాన్యులు బలికాకుండా ఉండేందుకు కాల్పుల విరమణను ప్రకటించినట్టు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది.

Russia Ukraine War Ukraine Seeks Meeting With Russia Third Time To Discuss On War (1)

Russia Ukraine War Ukraine Seeks Meeting With Russia Third Time To Discuss On War 

రష్యా ప్రకటనతో యుక్రెయిన్‌తో పాటు విదేశీయులకు భారీ ఊరట కలిగినట్టే చెప్పవచ్చు. యుద్ధం సమయంలో దేశ సరిహద్దులను దాటడంలో భారతీయులు సహా ఇతర విదేశీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ స్వదేశానికి వెళ్లాలనుకునేవారంతా యుక్రెయిన్ సరిహద్దుల్లో నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు వీలు పడింది. కాల్పుల విరమణ సమయం దాటిన అనంతరం రష్యా మళ్లీ కాల్పులను ప్రారంభించే అవకాశం ఉంది.

ఇప్పటికే.. యుద్ధాన్ని ఆపండి. లేదంటే.. యుక్రెయిన్‌లో నో ఫ్లైజోన్ అమలు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటో సభ్య దేశాలను కోరారు. నో ఫ్లైజోన్ అమలు చేయాలనే ఆయన ప్రతిపాదనను నాటో తిరస్కరించింది. అలా చేస్తే.. ఐరోపాలో పెను యుద్ధానికి దారితీస్తుందన్న నాటో హెచ్చరిస్తోంది. యుక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ ఏర్పాటుకు తిరస్కరించినుందుకు ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)పై అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు.

నాటా నిర్ణయంతో యుక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరింత బాంబు దాడి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అవుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 24న రష్యా భూమి, సముద్రం, వాయుమార్గం ద్వారా యుక్రెయిన్ పై ఏకకాలంలో దాడులకు తెగబడింది.

Read Also : Russia Ceasefire : యుక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా బ్రేక్.. మాకు మనసుంది.. అందుకే కాల్పుల విరమణ..!